Janasena Leader Arrest : తిరుపతిలో జనసేన నాయకుడి అరెస్ట్‌, బెయిల్‌పై విడుదల-pawan kalyan fires on ap police with arrest of tirupati janasena leader ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Pawan Kalyan Fires On Ap Police With Arrest Of Tirupati Janasena Leader

Janasena Leader Arrest : తిరుపతిలో జనసేన నాయకుడి అరెస్ట్‌, బెయిల్‌పై విడుదల

HT Telugu Desk HT Telugu
Nov 12, 2022 01:31 PM IST

Janasena Leader Arrest తిరుపతిలో జనసేన నాయకుడి అరెస్ట్ వ్యవహారం కలకలం రేపింది. మంత్రి రోజా ఫిర్యాదుతో జనసేన తిరుపతి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో కామెంట్ల నేపథ‌్యంలో కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. మరోవైపు నిందితుడికి నోటీసులు ఇవ్వకుండా అదుపులోకి తీసుకోవడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

తిరుపతిలో జనసేన నాయకుడి అరెస్ట్‌పై పవన్ ఆగ్రహం
తిరుపతిలో జనసేన నాయకుడి అరెస్ట్‌పై పవన్ ఆగ్రహం

Janasena Leader Arrest తిరుపతిలో జనసేన నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి సోషల్ మీడియా పోస్టుల నేపథ్యంలో తిరుపతి నాయకుడిని అరెస్ట్‌ చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు బనాయించి జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇంఛార్జి కిరణ్ రాయల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, ఏ కేసు పెట్టారో చెప్పకుండా, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకుండా పొలీసులు వ్యవహరించారని నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇంటి తలుపులకు తాళాలు వేసి మరీ కిరణ్ రాయల్ ను పోలీసులు చట్ట విరుద్ధంగా అరెస్టు చేయడం దురదృష్టకరమన్నారు. నగరి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగంగా చర్చించడానికి ముందుకు రావాలని మంత్రి రోజాను కిరణ్ రాయల్ సవాల్ చేయడంతో... కక్షగట్టిన మంత్రి జనసేన నాయకులు, వీర మహిళలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.

వైసీపీ నాయకులు రాజకీయ దురుద్దేశంతో.. వాళ్లు చెప్పిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సరైంది కాదని, ముందుగా నోటీసులు ఇవ్వండి న్యాయపరంగా చేయాల్సిన పోరాటం తాము చేస్తామన్నారు. అవసరమైతే మా నాయకులే పోలీసులకు తగిన విధంగా సహకరిస్తారని చెప్పారు. మంత్రి చెప్పారని ఇష్టానుసారం అరెస్టు చేయడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మంత్రి రోజా గారు బహిరంగంగా ఎలా మాట్లాడతారో ప్రజలందరికీ తెలుసని పార్టీ నాయకుడి కోసం న్యాయపోరాటం చేస్తామని ప్రకటించారు.

జనసేన పార్టీ నాయకుడిఅరెస్ట్‌ వ్యవహారంపై పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. కిరణ్ రాయల్ అరెస్టు అంశం మీద పార్టీ నాయకులతో చర్చించారు. జన సైనికులంతా కిరణ్ రాయల్ కుటుంబానికి అండగా నిలబడాలని సూచించారు. ప్రజా సమస్యలపై బలంగా మాట్లాడుతున్నందుకే అరెస్టులు చేశారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపులో ఆయనపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రజా క్షేత్రంలో జనసేన పార్టీని ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరని హెచ్చరించారు.

జనసేన నాయకుడికి కోర్ట్ బెయిల్….

మరోవైపు తిరుపతిలో పోలీసులు అరెస్ట్‌ చేసిన నాయకుడిని కోర్టులో హాజరు పరిచారు. నిందితుడిపై నమోదు చేసిన సెక్షన్లకు సిఆర్‌పిసి 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించాలని ఆదేశించారు. నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని చెప్పడంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

IPL_Entry_Point

టాపిక్