Tirupati SVIMS : లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి..! స్పృహలోకి రాగానే-patient attacked the lady doctor in tirupati svims hospital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Svims : లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి..! స్పృహలోకి రాగానే

Tirupati SVIMS : లేడీ డాక్టర్ పై పేషెంట్ దాడి..! స్పృహలోకి రాగానే

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 25, 2024 07:58 AM IST

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్ పై ఓ రోగి చేయి చేసుకున్నాడు. అందరూ చూస్తుండగానే దాడికి దిగాడు. ఈ ఘటనను ఖండిస్తూ… జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. దాడికి సంబంధిచిన దృశ్యాలు వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

డాక్టర్‌పై పేషెంట్ దాడి
డాక్టర్‌పై పేషెంట్ దాడి

తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో లేడీ డాక్టర్ పై ఓ రోగి దాడికి దిగాడు. అందరూ చూస్తుండగానే…. విచక్షణారహితంగా ప్రవర్తించాడు. స్పహాలోనికి వచ్చిన వెంటనే సదరు రోగి.. డాక్టర్ పై దాడి చేశాడు. తోటి డాక్టర్లు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఆగలేదు. ఈ ఘటనపై డాక్టర్లు ఆందోళనకు దిగారు.

వివరాల్లోకి వెళ్తే…. బంగారు రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఇటీవలే స్పహా కోల్పోగా ఓ ఆస్పత్రికి తరలించారు. అయితే మెరుగైన చికిత్స కోసం శనివారం ఉదయం  తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి మార్చారు.  స్విమ్స్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత సదరు వ్యక్తి స్పృహలోకి వచ్చాడు. 

స్పహాలోకి వచ్చిన రాజు… ఆ తర్వాత వింతగా ప్రవర్తించాడు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిలా తనకు చికిత్స చేస్తున్న లేడీ డాక్టర్ పై దాడికి దిగాడు. వార్డులో అందరూ చూస్తుండగానే చేయి చేసుకున్నాడు.   ఈ వ్యవహారం మొత్తం వార్డులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. 

డాక్టర్ల ఆందోళన…

లేడీ డాక్టర్ పై దాడి ఘటనను తోటి వైద్యులు తీవ్రంగా ఖండించారు. ఆస్పత్రిలోని వైద్యులు ఆందోళనకు దిగారు.  టీటీడీ ఈవో వచ్చి ఈ ఘటనపై సమాధానం చెప్పాలంటూ ఆస్పత్రి ముందు బైఠాయించారు. 

డాక్టర్ల ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తామని హామీనిచ్చారు. అతను కోలుకోగానే విచారిస్తామని చెప్పారు. ఈవో వచ్చి మాకు హామీ ఇవ్వాలని అప్పటిదాక ధర్నా అపడం కుదరదని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఈవో రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులకు, జూనియర్‌ వైద్యులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

 

టాపిక్