Trains Cancelled : విజయవాడ డివిజన్‌లో రైళ్ల రద్దు, రీ షెడ్యూలింగ్...
Trains Cancelled నిర్వహణపరమైన కారణాలతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను రీ షెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించారు. రద్దైన రైళ్లలో ప్రధానంగా ప్యాసింజర్ రైళ్లను విజయవాడ డివిజన్ పరిధిలో రద్దు చేశారు. ట్రాక్షన్ పనులు, నిర్వహణా కారణాలతో రైళ్లను రద్దు చేయడంతో పాటు కొన్నింటిని రీ షెడ్యూల్ చేసినట్లు ప్రకటించారు.
Trains Cancelled ట్రైన్ నంబర్ 07279 విజయవాడ-భద్రాచలం రోడ్-విజయవాడ ప్యాసింజర్ రైలుతో పాటు ట్రైన్ నంబర్ 07278 భద్రాచలం రోడ్-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను గురువారం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
ట్రైన్ నంబర్ 07978 విజయవాడ-బిట్రగుంట ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17237 బిట్రగుంట-చెన్నై సెంట్రల్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17238 చెన్నై సెంట్రల్ -బిట్రగుంట ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07977 బిట్రగుంట-విజయవాడ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07500 విజయవాడ-గూడూర్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17267 కాకినాడ పోర్ట్- విశాఖపట్నం ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 17268 విశాఖపట్నం-కాకినాడ పోర్ట్ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07461 విజయవాడ-ఒంగోలు ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07576 ఒంగోలు - విజయవాడ ప్యాసింజర్ రైళ్లను గురువారం రద్దు చేశారు.ట్రైన్ నంబర్ 17258 కాకినాడ పోర్ట్-విజయవాడ రైలును కాకినాడ-రాజమండ్రి మధ్య రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 17257 విజయవాడ-కాకినాడ పోర్ట్ రైలును రాజమండ్రి-కాకినాడ పోర్ట మధ్య రద్దు చేశారు.
రైళ్లు కిటకిట… టిక్కెట్లకు నో రూమ్….
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైళ్లన్ని కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో స్వస్థలాలకు వెళ్లే వారితో రైళ్లు నిండిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పండుగ ప్రయాణాల కోసం భారీ సంఖ్యలో రైళ్లను ఏర్పాటు చేసినా అవన్నీ నిండిపోయాయి. మరోవైపు ఎక్స్ ప్రెస్ రైళ్లలో రిజర్వేషన్ బోగీలు తగ్గిపోవడం, రైలుకు ముందు, వెనుక ఒక్కో బోగీను మాత్రమే అందుబాటులో ఉంచడంతో రిజర్వేషన్ లేని ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి లక్షలాది మంది స్వస్థలాలకు వస్తుంటారు. వీరి కోసం తెలంగాణ రోడ్డు రవాణా సంస్థతో పాటు, ఏపీఎస్ ఆర్టీసి కూడా భారీగా బస్సుల్ని ఏర్పాటు చేసింది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు.
బస్సులతో పోలిస్తే రైళ్లలో ఛార్జీలు అధికంగా ఉండటంతో ప్రయాణికులను రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ప్రత్యేక రైళ్లతో సహా రెగ్యులర్ రైళ్ళలో టిక్కెట్ల విక్రయాలు పూర్తై పోవడంతో కుటుంబాలతో ప్రయాణించే వారికి ఇక్కట్లు తప్పడం లేదు. దీనికి తోడు జనరల్ బోగీల సంఖ్య తగ్గిపోవడంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు.