Free gas Scheme: దీపం 2లో తొలి సిలిండర్‌ బుకింగ్‌కు మరో ఐదు రోజులే గడువు… 98లక్షల మందికి నగదు చెల్లింపు..-only five more days left for booking the first cylinder in deepam 2 subsidy payment to 98 lakh people ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Free Gas Scheme: దీపం 2లో తొలి సిలిండర్‌ బుకింగ్‌కు మరో ఐదు రోజులే గడువు… 98లక్షల మందికి నగదు చెల్లింపు..

Free gas Scheme: దీపం 2లో తొలి సిలిండర్‌ బుకింగ్‌కు మరో ఐదు రోజులే గడువు… 98లక్షల మందికి నగదు చెల్లింపు..

Sarath Chandra.B HT Telugu

Free gas Scheme: ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న దీపం 2 ఉచిత గ్యాస్‌ సిలిండర్ పథకంలో తొలి సిలిండర్‌ బుకింగ్‌కు మరో ఐదు రోజులే గడువు ఉంది. మార్చి 31లోగా గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకున్న వారికి మాత్రమే సబ్సిడీ చెల్లిస్తారు. ఇప్పటి వరకు 98లక్షల మంది ఈ పథకంలో ఉచిత సిలిండర్ పొందారు.

ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకంలో తొలి బుకింగ్‌కు మరో ఐదు రోజులే గడువు

Free gas Scheme: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దీపం 2 పథకంలో మొదటి సిలిండర్‌ బుకింగ్ గడువు మరో ఐదు రోజుల్లో పూర్తి కానుంది. తొలి ఉచిత గ్యాస్ సిలిండర్‌ ను మార్చి 31 వరకు బుక్‌ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు సిలిండర్‌ పొందని వారు వెంటనే గ్యాస్ బుక్ చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని, దీపం-2 పథకంలో తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

ఉచిత గ్యాస్ సిలిండర్‌ ఇప్పటి పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలన్నారు ఇప్పటివరకు 98 లక్షల మంది తొలి ఉచిత సిలిండర్ వినియోగించుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. మార్చి 26వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 98, 25,483 మంది గ్యాస్‌ సిలిండర్‌లను ఉచితంగా పొందారని మంత్రి వివరించారు. వీరిలో 96,42,933 మందికి ఇప్పటికే డెలివరీ చేసినట్టు వివరించారు.

రూ.756 కోట్ల చెల్లింపులు…

ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకం అమలు కోసం రూ.7,56,52,07,331 కోట్లను విడుదల చేశారు. వీటిలో డెలివరీ చేసిన సిలిండర్లకు కనెక్షన్ దారులకు రూ. 7,53,91,55,952 కోట్లను బ్యాంకు ఖాతాలకు చెల్లించారు.

2024 నవంబర్‌ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని మంత్రి నాదెండ్ల గుర్తు చేశారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల లోపు గ్యాస్ డెలివరీ ఇస్తారు.ఆ తర్వాత సిలెండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్దిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుందన్నారు

ఉచిత సిలిండర్ల పంపిణీ ఇలా…

ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. ఉచిత సిలిండర్లను ఒకేసారి కాకుండా నాలుగు నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రతి ఏడాది ఏప్రిల్ - జూలై (01), ఆగష్టు –నవంబర్ (01), డిసెంబర్ –మార్చి (01) మధ్య ఉచిత గ్యాస్ సిలెండర్ బుక్ చేసుకోవచ్చు.

ఉచిత గ్యాస్ సిలిండర్ పొందడానికి అర్హతలు

1)ఎల్.పి.జి.కనెక్షన్ కలిగి ఉండటం

2) రైస్ కార్డ్,

3) ఆథార్ కార్డు

4). ఆధార్ కార్డుతో రైస్ కార్డుతో అనుసంధానం అయి ఉండాలి

ఎటువంటి సమాచారం లోపం ఉన్న టోల్ ఫ్రీ నెం.1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల తెలిపారు.

ఉచిత సిలిండర్‌ పథకానికి దూరంగా 57లక్షల గ్యాస్ కనెక్షన్లు

ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. గత ఏడాది నవంబర్ 1న పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. తొలి సిలిండర్‌ బుకింగ్ గడువు మరో ఐదు రోజుల్లో ముగుస్తుంది. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ఇప్పటికే చెల్లించింది.

గత ఏడాది అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీ పోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

పథకానికి దూరంగాలక్షల కనెక్షన్లు…

ఏపీలో ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి వైట్ రేషన్‌కార్డుతో పాటు, ఆధార్‌ కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ కలిగి ఉండాలి. సూపర్‌ సిక్స్‌లో భాగంగా మహిళలకు 3 గ్యాస్‌ సిలిండర్లను అందిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 1.55కోట్ల గ్యాస్ కనెక్షన్లలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర తెల్ల రేషన్ కార్డులు ఉండగా అంతే సంఖ్యలో గ్యాస్ కనెక్షన్లు ఉంటాయనే లెక్కలున్నాయి. ఇప్పటి వరకు 98లక్షల మందికి రాయితీ సొమ్ము చెల్లించారు. పన్ను చెల్లింపుదారులు, రేషన్ కార్డులు లేని కుటుంబాలు, ప్రభుత్వ ఉద్యోగుల్ని మినహాయించిన దాదాపు 35-40లక్షల మంది ఉచిత గ్యాస్ పథకానికి దూరమైనట్టు కనిపిస్తోంది.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం