Railway Updates: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. పండగ సీజన్‌లో 14 ప్రత్యేక రైళ్లు.. రద్దీకి తగ్గట్టు ఏర్పాట్లు
Railway Updates: త్వరలో వరుస పండగలు రాబోతున్నాయి. దీంతో నగరాలు, పట్టణాల్లో ఉండే వారు సొంతూళ్లకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో రైల్వే టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించారు.
ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పండగ సీజన్‌లో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఈస్ట్ కోస్ట్ రైల్వే 14 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.
విశాఖపట్నం- చెన్నై ఎగ్మోర్- విశాఖపట్నం పూజ స్పెషల్..
విశాఖపట్నం - చెన్నై ఎగ్మోర్ పూజ ప్రత్యేక రైలు (08557) విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. సెప్టెంబర్ 7 నుంచి నవంబర్ 30 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. శనివారం రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నంలో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు ఉదయం 08.45 గంటలకు చెన్నై ఎగ్మోర్ చేరుకుంటుంది. చెన్నై ఎగ్మోర్ -విశాఖపట్నం పూజ స్పెషల్ రైలు (08558) చెన్నై ఎగ్మోర్ నుండి బయలుదేరుతుంది. సెప్టెంబర్ 8 నుండి డిసెంబర్ 1 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.30 గంటలకు చెన్నై ఎగ్మోర్‌లో బయలుదేరుతుంది. అదే రోజు రాత్రి 10.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, సామర్లకోట్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో ఇది ఆగుతుంది.
ప్రత్యేక రైళ్ల కొనసాగింపు..
పూజ, దీపావళి, ఛత్ పండుగ సీజన్లలో ప్రయాణించే వారికోసం ఈస్ట్ కోస్ట్ రైల్వే 12 వీక్లీ స్పెషల్ రైళ్లను కొనసాగించాలని నిర్ణయించింది.
విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం స్పెషల్..
విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-సికింద్రాబాద్ వీక్లీ స్పెషల్ (08579) రైలు సెప్టెంబర్ 4 నుండి నవంబర్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధవారం రాత్రి ఏడు గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు గురువారం ఉదయం 9.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో బయలుదేరే సికింద్రాబాద్-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ (08580) రైలు సెప్టెంబర్ 5 నుండి నవంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి గురువారం రాత్రి 7.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు శుక్రవారం ఉదయం 9.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ స్టాపేజ్‌లు ఉన్నాయి.
విశాఖపట్నం-తిరుపతి-విశాఖపట్నం స్పెషల్..
విశాఖపట్నం-తిరుపతి పూజ వీక్లీ ప్రత్యేక రైలు (08583) విశాఖపట్నం నుండి బయలుదేరుతుంది. సెప్టెంబర్ 2 నుండి నవంబర్ 25 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి, మరుసటి రోజు మంగళవారం ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి-విశాఖపట్నం పూజ వీక్లీ ప్రత్యేక రైలు (08584) తిరుపతి నుండి బయలుదేరుతుంది. సెప్టెంబర్ 3 నుండి నవంబర్ 26 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం రాత్రి 9.55 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి, మరుసటి రోజు బుధవారం ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలుకు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టాపేజ్‌లు ఉన్నాయి.
సికింద్రాబాద్-సంత్రాగచ్చి-సికింద్రాబాద్..
సికింద్రాబాద్ - సంత్రాగచ్చి సమ్మర్ స్పెషల్ (07221) రైలు అక్టోబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం, శనివారాల్లో రైలు ఉదయం 6.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. ఇది దువ్వాడకు రాత్రి 7:48 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 7:50 గంటలకు బయలుదేరుతుంది. సంత్రాగచ్చి - విశాఖపట్నం వేసవి ప్రత్యేక (07222) రైలు 2024 అక్టోబర్ 2 నుండి 2025 జనవరి 10 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి బుధ, ఆదివారాల్లో ఈ రైలు మధ్యాహ్నం 12.20 గంటలకు సంత్రాగచ్చి నుండి బయలుదేరుతుంది. ఇది దువ్వాడకు తెల్లవారు జామున 03.20 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.22 గంటలకు బయలుదేరుతుంది.
సికింద్రాబాద్-అగర్తల- సికింద్రాబాద్..
సికింద్రాబాద్ - అగర్తల స్పెషల్ రైలు (07030) అక్టోబర్ 7 నుండి డిసెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి సోమవారం సాయంత్రం 4.35కి సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 4.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. గురువారం ఉదయం 4.40కి అగర్తల చేరుకుంటుంది. అగర్తల - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07029) 2024 అక్టోబర్ 11 నుండి 2025 జనవరి 3 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి శుక్రవారం ఉదయం 6.20కి అగర్తలలో బయలుదేరుతుంది. ఆదివారం తెల్లవారు జామున 3.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఆదివారం సాయంత్రం 4.15కి సికింద్రాబాద్ చేరుకుంటుంది.
సికింద్రాబాద్-సంత్రాగచ్చి-సికింద్రాబాద్..
సికింద్రాబాద్ - సంత్రాగచ్చి ప్రత్యేక రైలు (07223) అక్టోబర్ 4 నుండి డిసెంబర్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రతి శుక్రవారం ఉదయం 7.05కి సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. రాత్రి 7.55కి దువ్వాడకు చేరుకుంటుంది. సంత్రాగచ్చి - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07224) రైలు అక్టోబర్ 5 నుండి డిసెంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శనివారం ఈ రైలు మధ్యాహ్నం 12.20 గంటలకు సంత్రాగచ్చి నుండి బయలుదేరుతుంది. ఇది దువ్వాడకు తెల్లవారు జామున 02.03 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.05 గంటలకు బయలుదేరుతుంది.
సికింద్రాబాద్-షాలిమార్-సికింద్రాబాద్..
సికింద్రాబాద్ - షాలిమార్ ప్రత్యేక రైలు (07225) అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం ఈ రైలు ఉదయం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరుతుంది. ఇది దువ్వాడకు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 2.35 గంటలకు బయలుదేరుతుంది. షాలిమార్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07226) అక్టోబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. ప్రతి మంగళవారం ఈ రైలు ఉదయం 10 గంటలకు షాలిమార్ నుండి బయలుదేరుతుంది. ఇది దువ్వాడకు తెల్లవారు జామున 1.25 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి 1.30 గంటలకు బయలుదేరుతుంది.
శబరిమల భక్తులకు ప్రత్యేక రైళ్లు..
ప్రజలు, శబరిమలకు వెళ్లే భక్తుల డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే.. వారానికోసారి రెండు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-కొల్లాం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (08539) రైలు సెప్టెంబర్ 4 నుండి నవంబర్ 27 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు బుధవారం ఉదయం 8.20 గంటలకు బయలుదేరుతుంది, ఇది గురువారం మధ్యాహ్నం 12.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. కొల్లాంలో బయలుదేరే కొల్లాం-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ (08540) రైలు సెప్టెంబర్ 5 నుండి నవంబర్ 28 వరకు అందుబాటులో ఉంటుంది. గురువారం రాత్రి 7.35 గంటలకు కొల్లాం నుండి బయలుదేరుతుంది. ఇది శుక్రవారం నాడు రాత్రి 11.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లకు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టాపేజ్‌లు ఉన్నాయి.
రద్దు అయిన రైళ్లు..
జీఎంఆర్ చెన్నై సెంట్రల్ నుండి బయలుదేరే జీఎంఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06073) రైలును రద్దు చేశారు. ఈ రైలు సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 9 వరకు రద్దు చేశారు. అలాగే భువనేశ్వర్ నుండి బయలుదేరే భువనేశ్వర్-జీఎంఆర్ చెన్నై సెంట్రల్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (06074) రైలును రద్దుచేశారు. ఈ రైలును సెప్టెంబర్ 3 నుంచి సెప్టెంబర్ 10 వరకు రద్దు చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)