Trains Cancellation: టిక్కెట్ బుకింగులు లేక నేడు పలు రైళ్ల రద్దు, తిరుగు ప్రయాణాలకు కటకట..
Trains Cancellation: సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణికుల నుంచి తగినన్ని బుకింగ్స్ లేకపోవడంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. ప్రయాణికుల రద్దీని, వరుస సెలవుల్ని అంచనా వేయకుండా ప్రత్యేక రైళ్లను ప్రకటించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
Trains Cancellation: దక్షిణ మధ్య రైల్వే ముందస్తు ప్రణాళిక లోపంతో పలు ప్రత్యేక రైళ్లు చివరి నిమిషంలో రద్దు అయ్యాయి. ఓ వైపు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్న సమయంలో ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వైపు ప్రకటించిన రైళ్లలో బుకింగ్స్ లేకపోవడంతో వాటిని రద్దు చేశారు.
ఆంధ్రప్రదేశ్్ నుంచి తెలంగాణ వైపు ప్రయాణికుల రద్దీ లేకపో వడం, ముందస్తు టికెట్ బుకింగ్లు లేనికారణంగా.. పలు మార్గాలకు సంబంధించిన రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటిచింది.. రద్దయినవాటిలో ఈ నెల13న వెళ్లాల్సిన కాకినాడ టౌన్- చర్లపల్లి (07032), మచిలీపట్నం-తిరుపతి (07122) ట్రైన్, 14న చర్లపల్లి-కాకినాడ పట్టణం (07031), 16న సోలాపూర్- తిరుపతి (01437), 17న తిరుపతి సోలాపూర్ (01438), 18న గుంటూరు -కొల్లాం (07181), 20న కొల్లాం- గుంటూరు (07182) ట్రైన్లను రద్దు చేశారు.
రద్దైన రైళ్లలో కాకినాడ టౌన్ - చర్లపల్లి( నంబర్ 07032) రైలు జనవరి 13న రద్దైంది. తిరుగుప్రయాణంలో 14వ తేదీన చర్లపల్లి నుంచి బయలుదేరాల్సిన 07031 రైలు కూడా రద్దు చేశారు.
13వ తేదీన ప్రకటించిన 07122 మచిలీపట్నం - తిరుపతి రైలును కూడా రద్దు చేశారు. 16వ తేదీన ప్రకటించిన ట్రైన్ నంబర్ 01437 సోలాపూర్ -తిరుపతి రైలు కూడా రద్దైంది.
17వ తేదీన ప్రకటించిన తిరుపతి -సోలాపూర్ 01438 రైలు కూడా రద్దు అయ్యింది. 18వ తేదీన ప్రకటించిన ప్రత్యేక రైల్లో ట్రైన్ నంబర్ 07181 గుంటూరు- కొల్లాం రైలు రద్దైంది. తిరుగు ప్రయానంలో వెళ్లాల్సిన కొల్లాం- గుంటూరు (07182) రైలు కూడా రద్దైంది. మరోవైపు 13, 14,15 పండుగ తర్వాత హైదరాబాద్ వైపు ప్రయాణాలకు తీవ్రమైన రద్దీ ఏర్పడనుంది.