Lakshmi Parvathi On CBN : ఎన్టీఆర్‌ పేరు మార్పులో కుట్ర లేదంటున్న లక్ష్మీపార్వతి-ntr wife lakshmi parvathi slams chandra babu and other tdp leaders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lakshmi Parvathi On Cbn : ఎన్టీఆర్‌ పేరు మార్పులో కుట్ర లేదంటున్న లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi On CBN : ఎన్టీఆర్‌ పేరు మార్పులో కుట్ర లేదంటున్న లక్ష్మీపార్వతి

HT Telugu Desk HT Telugu
Sep 26, 2022 01:52 PM IST

Lakshmi Parvati On CBN టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు భార్య కంటే పెద్ద పదవి ఏది లేదన్నారు లక్ష్మీపార్వతి. తన వ్యక్తిగత జీవితం మీద టీడీపీ నాయకులు , కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

<p>ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి</p>
ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‍తో తన వివాహం తిరుపతిలో జరిగిందని, వివాహంపై మాట్లాడే నైతికి హక్కు ఎవరికీ లేదన్నారు నందమూరి లక్ష్మీపార్వతి. తన వ్యక్తిగత జీవితంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కొన్ని టీవీ ఛానల్స్‌లో ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నారని, కొన్ని ఛానల్స్‌లో దారుణంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్టీఆర్‍కు ద్రోహం చేసిన వారే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నారని, ఎన్టీఆర్‍తో తన వివాహం చంద్రబాబుకి మొదటి నుంచీ ఇష్టం లేదని, తనను రాజకీయాల్లోకి తీసుకొస్తానని ఎన్టీఆర్ ఏనాడూ చెప్పలేదన్నారు.

yearly horoscope entry point

చరిత్రను ఎవరూ చెరిపేయలేరని, అప్పుడు ఏం జరిగిందో ఇప్పటి తరం తెలుసుకోవాలని చెప్పారు. తనకు పదవి కావాలని ఏనాడూ ఎన్టీఆర్‍ను అడగలేదని, టెక్కలి సీటు ఇస్తానన్నా తీసుకోలేదని చెప్పారు. ఎన్టీఆర్ భార్యగా కంటే పెద్ద పదవి ఏదీ లేదని, ఎన్టీఆర్‍పై ఈనాడులో పిచ్చిపిచ్చి కార్టూన్లు వేశారని, పత్రికల్లో పిచ్చి రాతలపైనా అప్పట్లోనే ఎన్టీఆర్ స్పందించారని గుర్తు చేశారు.

చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకే ఈ ప్రచారం చేస్తున్నారని, ఎన్టీఆర్‌ ఇచ్చిన చివరి ఇంటర్వ్యూలో మా వివాహం గురించి చాలా స్పష్టంగా చెప్పారన్నారు. చంద్రబాబు దుర్మార్గానికి కుటుంబ సభ్యులు వంతపాడారని, అల్లుళ్ల కోట్లాట వల్లే 1989లో ఓడిపోయామని ఎన్టీఆర్ ఆనాడు చెప్పారన్నారు. తాను ఆయన జీవితంలోకి ప్రవేశించాక టీడీపీ ఘన విజయం సాధించిందని, ఏరోజూ పార్టీ విషయాల్లో నేను జోక్యం చేసుకోలేదని చెప్పారు. అప్పుడు పార్టీలో అసమ్మతి రాలేదని, కుట్ర చేశారని, ఎన్టీఆర్ విజయాన్ని చూసి ఓర్వలేక నాపై బురద చల్లారని లక్ష్మీ పార్వతి ఆరోపించారు. పాముకు పాలు పోస్తున్నావని చంద్రబాబు గురించి ఎన్టీఆర్ ఆరోజే చెప్పారని, ఎన్టీఆర్ వెన్నంటే ఉంటానంటూ ఆరోజు చంద్రబాబు ప్రమాణం చేశారని, పార్టీని కాజేసిన వ్యక్తికి ఎన్టీఆర్ కుమారులు మద్దతు పలికారని, వైశ్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు వేయించిన సంగతి గుర్తు లేదా అని నిలదీశారు. ఈరోజు తండ్రి గురించి మాట్లాడుతున్న కుటుంబ సభ్యులు సిగ్గుపడాలని ఇప్పటికైనా పశ్చాత్తాప పడాలన్నారు.

చంద్రబాబు కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారంతో ఎమ్మెల్యేల్లో భయాందోళన సృష్టించారని, అప్పటి స్పీకర్ యనమల వెన్నుపోటులో భాగమయ్యాడని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఏనాడైనా ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చడానికి బాబు, రాధాకృష్ణ కుట్ర చేయలేదా అని నిలదీశారు. జిల్లా పేరు ఎన్టీఆర్ కావాలా.. యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ కావాలా? అని అడిగి ఉంటే జిల్లా పేరు కావాలని నేను కోరుకుంటానని చెప్పారు. ఎన్టీఆర్ పేరు మార్పుపై సీఎం జగన్ చాలా స్పష్టంగా చెప్పారని, రుపాయి వైద్యునిగా పేరు తెచ్చుకున్న గొప్ప వ్యక్తి వైఎస్సార్ పేరు ఎందుకు పెట్టామో జగన్ స్పష్టంగా చెప్పారని, ఎన్టీఆర్‍పై కోపంతో చేసిన పని కాదన్నారు. రాష్ట్రంలో మరో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని సీఎంను కోరతా నన్నారు.

Whats_app_banner