NTR Jobs : ఎన్టీఆర్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలో 22 పోస్టుల భర్తీ, ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు న‌వంబ‌ర్ 5 ఆఖ‌రు తేదీ-ntr district icps saa children home recruitment 22 vacancy nov 5th last date ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ntr Jobs : ఎన్టీఆర్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలో 22 పోస్టుల భర్తీ, ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు న‌వంబ‌ర్ 5 ఆఖ‌రు తేదీ

NTR Jobs : ఎన్టీఆర్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలో 22 పోస్టుల భర్తీ, ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు న‌వంబ‌ర్ 5 ఆఖ‌రు తేదీ

HT Telugu Desk HT Telugu
Oct 28, 2024 04:13 PM IST

NTR Jobs : ఎన్టీఆర్ జిల్లాలోని ఐసీపీఎస్‌, ఎస్ఎస్ఏ, చిల్డ్రన్ హోంలో 22 ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించారు. అర్హులైన మహిళా అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలో 22 పోస్టుల భర్తీ, ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు న‌వంబ‌ర్ 5 ఆఖ‌రు తేదీ
ఎన్టీఆర్ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలో 22 పోస్టుల భర్తీ, ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు న‌వంబ‌ర్ 5 ఆఖ‌రు తేదీ

ఎన్టీఆర్ జిల్లాలోని మ‌హిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఐసీపీఎస్‌, ఎస్ఎస్ఏ, చిల్డ్రన్ హోంలో ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసేందుకు న‌వంబ‌ర్ 5న ఆఖ‌రు తేదీ. ఆస‌క్తి గ‌ల వారు నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసుకోవాల‌ని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ‌, సాధికార‌త అధికారిణి జి.ఉమాదేవి తెలిపారు.

ఎన్‌టీఆర్‌ జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప‌రిధిలోని ఖాళీగా ఉన్న 22 ఉద్యోగాల‌కు అర్హులైన స్థానిక మ‌హిళ అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌ను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్‌ ప‌ద్ధతిలో భ‌ర్తీ చేస్తున్నారు. ప‌నితీరు ఆధారంగా వారి స‌ర్వీసును కొన‌సాగిస్తారు. ఇందులో అర్హులైన అభ్యర్థుల‌కు మాత్రమే ఇంట‌ర్వ్యూల‌కు పిలుస్తారు. ఇంట‌ర్వ్యూలు నిర్వహించి నియామ‌కం జ‌రుపుతారు. ఈ ఉద్యోగాల‌కు ఎటువంటి రాత ప‌రీక్ష ఉండ‌దు.

ఆస‌క్తి గ‌ల అభ్యర్థులు ద‌ర‌ఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s39461cce28ebe3e76fb4b931c35a169b0/uploads/2024/10/2024102656.pdf ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. సంబంధిత స‌ర్టిఫికేట్లను జ‌త‌చేసి, గ‌జిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి ద‌ర‌ఖాస్తును న‌వంబ‌ర్ 5 సాయంత్రం 5 గంట‌ల లోపు జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారిత అధికారిణి కార్యాల‌యం, డోర్ నెంబ‌ర్ 6-93, కార్మెల్ చ‌ర్చి ఎదురురోడ్‌, కానూరు, విజ‌య‌వాడ‌లో అంద‌జేయాలి.

మొత్తం ఎన్ని పోస్టులు?

మొత్తం 22 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఐసీపీఎస్ యూనిట్‌లో అకౌంటెంట్‌-1, డేటా అన‌లిస్ట్‌-1, ఎస్ఏఏ యూనిట్‌లో మేనేజర్, కోఆర్డినేట‌ర్‌-1 పోస్టులు, ఏఎన్ఎం (న‌ర్సు)-1, డాక్టర్ (పార్ట్ టైం)-1, ఆయా-4, చౌకీదార్ (వాచ్‌మెన్‌)-1 పోస్టులు, చిల్డ్రన్ హోంలో స్టోర్ కీప‌ర్ కం అకౌంటెంట్‌-1, ఎడ్యూకేట‌ర్ (పార్ట్ టైం)-1, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌ మ్యూజిక్ టీచ‌ర్‌-2, పీటీ ఇన్సట్రెక్టర్ కం యోగా టీచ‌ర్ (పార్ట్ టైం)-2, కుక్ (ఔట్ సోర్సింగ్‌)-1, హెల్పర్ (ఔట్ సోర్సింగ్‌)-2, హౌస్ కీప‌ర్ (ఔట్ సోర్సింగ్‌)-2, హెల్ప‌ర్ కం నైట్ వాచ్‌మెన్ (ఔట్ సోర్సింగ్‌)-1 పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు.

నెల‌వారీ జీతాలు

నెల‌వారీ జీతాలు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉంటాయి. అకౌంటెంట్‌కు రూ.18,536, డేటా అన‌లిస్ట్‌కు రూ.18,536, మేనేజ‌ర్‌కు రూ.23,170, డాక్టర్‌కు రూ.9,930, ఆయాకు రూ.7,944, చౌకీదార్‌కు రూ.7,944, స్టోర్ కీప‌ర్ కం అకౌంటెంట్‌కు రూ.18,636, ఎడ్యూకేట‌ర్‌కు రూ.10,000, మ్యూజిక్ టీచ‌ర్‌కు రూ.10,000, యోగ టీచ‌ర్‌కు రూ.10,000, కుక్‌కు రూ.9,930, హెల్పర్‌కు రూ. 7,944, హౌస్ కీప‌ర్‌కు రూ.7,944, నైట్ వాచ్‌మెన్‌కు రూ.7,944 ఉంటుంది.

వ‌యో ప‌రిమితి

ద‌ర‌ఖాస్తు దాఖ‌లు చేసే అభ్యర్థుల వ‌యో ప‌రిమితి 2024 జులై 1 నాటికి 25 నుండి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడ‌బ్ల్యూఎస్‌ అభ్యర్థుల‌కు ఐదేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు వ‌య‌స్సు స‌డలింపు ఉంటుంది.

అర్హత‌లు

విద్యా అర్హత‌లు, అనుభ‌వం ఒక్కో పోస్టుకు ఒక్కో ర‌కంగా ఉన్నాయి. ప‌దో త‌ర‌గ‌తి నుంచి డిగ్రీ వ‌ర‌కు ఆయా పోస్టుల‌కు విద్యా అర్హతులు ఉన్నాయి. అలాగే కొన్ని పోస్టుల‌కు అనుభ‌వం, మ‌రి కొన్నింటికి కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం కూడా కావాలి. పూర్తి వివ‌రాలు ఈ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌ https://cdn.s3waas.gov.in/s39461cce28ebe3e76fb4b931c35a169b0/uploads/2024/10/2024102656.pdf క్లిక్‌చేస్తే ఓపెన్ అవుతాయి.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner