NTR Centenary Celebrations : ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు.. ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి
- NTR Centenary Celebrations Photos: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు శనివారం హైదరాబాద్ లోని కైత్లాపూర్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. NTR సినీ, రాజకీయ జీవితంపై రూపొందించిన చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది.
- NTR Centenary Celebrations Photos: ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు శనివారం హైదరాబాద్ లోని కైత్లాపూర్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖలు హాజరయ్యారు. ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. NTR సినీ, రాజకీయ జీవితంపై రూపొందించిన చిత్రాల ప్రదర్శన ఆకట్టుకుంది.
(1 / 8)
సభా వేదికపై ఏర్పాటు చేసిన మూడు భారీ డిజిటల్ తెరలపై.. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవితంపై రూపొందించిన చిత్రాల ప్రదర్శన, ఆయన హావభావాలతో కూడిన హోర్డింగులు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
(facebook)(2 / 8)
ఈ వేడుకల్లో రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మనకు రాముడు, కృష్ణుడి గురించి మాట్లాడలేము.. వారిని అనుభూతి చెందాలి. తెలుగు భాషకు ఒక గుర్తింపును తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ కొనియాడారు. తన జీవితంలో ఎన్టీఆర్‌ను ఒకే ఒక్కసారి కలిశానని చెప్పారు చరణ్. ఆయన తనకు ప్రత్యేకంగా బ్రేక్ ఫాస్ట్ వడ్డించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
(3 / 8)
ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా అందరి హృదయాలు గెలుచుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. సీఎం అయిన తర్వాత పెత్తందారీ విధానమైన పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకంతో పేదల గుండెల్లో నిలిచారని చెప్పారు.
(facebook)(4 / 8)
ఎన్టీఆర్‌తో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు సీపీయం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. ఈ సందర్భంగా పలు ఘట్టాలను గుర్తు చేశారు సీతారాం ఏచూరి.
(facebook)(5 / 8)
ఈ కార్యక్రమానికి హాజరైన అక్కినేని నాగచైత్యన్య… కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు. నందమూరి తారక రామారావు గారు నటన, అందం, వాత్సల్యం గురించి తాను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు. రాముడు, శ్రీకృషుణుడు గురించి ఎవరన్నా మాట్లాడితే తనకు ముందు గుర్తుకు వచ్చే పేరు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. మా ఇంట్లో తాతగారు(ఎఎన్ఆర్) ఎన్టీఆర్ గురించి ఎప్పుడు మాట్లాడినా ఎంతో గౌరవంగా మాట్లాడేవారని చెప్పారు.
(facebook)(6 / 8)
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు హీరో విక్టరీ వెంకటేశ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కళాకారుడిగా సినిమా పరిశ్రమకు, తెలుగు జాతికి ఆయన ఎంతో చేశారని కొనియాడారు. వందేళ్లు గడిచినా ఆయన పేరు మారుమోగుతోందంటే తెలుగు వాడిగా గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.
(facebook)(7 / 8)
ఎన్టీఆర్ అద్భుత నటుడన్నారు మాజీ ఎంపీ మురళీ మోహన్. తనని ఎన్టీఆర్ తమ్ముడనే పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ కు కేంద్రం వెంటనే భారతరత్నను ప్రకటించాలని కోరారు.
(facebook)ఇతర గ్యాలరీలు