AP TG Mlc Elections: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల, ఫిబ్రవరి 27న పోలింగ్
AP TG Mlc Elections: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల భర్తీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో ఈసీ ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.
AP TG Mlc Elections: తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల భర్తీకి ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుండటంతో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మూడు స్థానాలు, తెలంగాణలో మూడు స్థానాలు మార్చి 29వ తేదీతో ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసేందుకు తాజాగా షెడ్యూల్ విడుదల చేశారు.
ఏపీలో తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలకు గ్రాడ్యుయేట్ల తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇళ్ల వెంకటేశ్వరరావు, కృష్ణా-గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్.లక్ష్మణరావు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం నియోజక వర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది.
తెలంగాణలో మెదక్-నిజమాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీ.జీవన్ రెడ్డి, మెదక్-నిజమాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ కూరా రఘోత్తమ్‌రెడ్డి, వరంగల్-ఖమ్మం - నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డిల పదవీ కాలం మార్చి 29తో ముగుస్తుంది.
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 3న జారీ చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు ఫిబ్రవరి 10వరకు గడువు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11న, ఉపసంహరణకు ఫిబ్రవరి 13న, ఎన్నికలను ఫిబ్రవరి 27న నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మార్చి 3న జరుగుతుంది. మార్చి 8లోగా ఎన్నికలు పూర్తి చేస్తారు.