ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, మే 18వరకు దరఖాస్తు గడువు…-notification released for admissions in andhra pradesh tribal welfare gurukul junior colleges ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, మే 18వరకు దరఖాస్తు గడువు…

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, మే 18వరకు దరఖాస్తు గడువు…

Sarath Chandra.B HT Telugu

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సులతో పాటు ఒకేషనల్ గ్రూపుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్‌ గురుకుల జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సులతో పాటు ఒకేషనల్ గ్రూపుల్లో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయ సంస్థల్లో జూనియర్ ఇంటర్ ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్‌లో ప్రవేశాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 33 గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాలల్ని నిర్వహిస్తున్నారు.

గిరిజన గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు 2024-25 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన గిరిజన, గిరిజనేతర విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, కాలేజీల వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. పూర్తి వివరాలకు https://twreiscet.apcfss.in/ అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేసే వారు పూర్తి సమాచారం కోసం జిల్లాల్లో అందుబాటులో ఉండే గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్ని సంప్రదించాల్సి ఉంటుంది.

గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేయడానికి మే 18వ తేదీ వరక గడువు ఉంది. ఈ కాలేజీల్లో ఇంటర్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఈసీ కోర్సులతో పాటు ఒకేషనల్ గ్రూప్స్‌ ఏ అండ్ టీ, సీజీఏ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే గురుకుల జూనియర్ కాలేజీల కాలేజీల అడ్మిషన్ నోటిఫికేషన్‌ ఈ లింకులో అందుబాటులో ఉంటుంది.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం