AP Gurukulam Jobs 2024 : గురుకులాల్లో కాంట్రాక్ట్ టీచింగ్ ఉద్యోగాలు - కేవలం డెమో, ఇంటర్వ్యూతోనే భర్తీ!
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని గురుకులాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నారు. డెమో, ఇంటర్వ్యూతోనే భర్తీ చేస్తారు. నవంబర్ 21వ తేదీన ఇంటర్వ్యూలు ఉంటాయి.
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో\అంబేద్కర్ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన గెస్ట్, పార్ట్ టైమ్ టీచర్స్‌ను భర్తీ చేయనున్నట్లు ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల సమన్వయ అధికారి ఏ. ఉదయశ్రీ తెలిపారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 21న జరిగే డెమో, ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు.
ఇంటర్వ్యూలు నవంబర్ 21 ఉదయం 10 గంటలకు కురుగుంట జేసీ పాఠశాలలో జరిగే డెమో, వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది. డెమో, వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరైన వారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. బాలికల పాఠశాలల్లో ఖాళీలను మహిళలతో మాత్రమే భర్తీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
విద్యా అర్హతలు:
1. జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులకు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికేట్ ఉండాలి.
2. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులకు పీజీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికేట్ ఉండాలి.
3. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు డిగ్రీ, బీఈడీ, టెట్ క్వాలిఫై సర్టిఫికేట్ ఉండాలి (టీజీటీ హిందీకు డిగ్రీతో పాటు పీజీ కూడా ఉండాలి)
4. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ) పోస్టులకు బీపీఎడ్, టెట్ క్వాలిఫై సర్టిఫికేట్
పోస్టుల ఖాళీలు:
- తిమ్మాపురం బాలికల పాఠశాల : టీజీటీ బయోలజీ సైన్స్ (బీఎస్), పీజీటీ సోషల్.
- ఉరవకొండ బాలికల పాఠశాల : జూనియర్ లెక్చరర్ (జేఎల్) ఇంగ్లీష్
- కురుగుంట బాలికల పాఠశాల : జూనియర్ లెక్చరర్ (జేఎల్) ఇంగ్లీష్, పీడీ
- అమరపురం బాలికల పాఠశాల : టీజీటీ పీఎస్, టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లీష్
- గుత్తి బాలికల పాఠశాల : జూనియర్ లెక్చరర్ (జేఎల్) కెమిస్ట్రీ, జూనియర్ లెక్చరర్ (జేఎల్) ఇంగ్లీష్
- హిందూపూరం బాలుర పాఠశాల : టీజీటీ ఫిజికల్ సైన్స్ (పీఎస్)
- హిందూపురం బాలికల పాఠశాల : టీజీటీ ఫిజికల్ సైన్స్ (పీఎస్)