SHRESHTA 2024 Admissions: శ్రేష్ట 2024 అడ్మిషన్లకు నోటిఫికేషన్... దరఖాస్తు చేసుకోండి ఇలా..
SHRESHTA 2024 Admissions: కేంద్రప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే శ్రేష్ట 2024 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది.
SHRESHTA 2024 Admissions: ఎస్సీ కులాల విద్యార్ధుల కోసం కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే శ్రేష్ట 2024 నోటిఫికేషన్ విడుదలైంది. 9,11తరగతుల్లో రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం అర్హులైన 8,10వ తరగతి విద్యార్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఎస్సీ కులాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్ధులకు రెసిడెన్షియల్ విద్యాబోధన కోసం శ్రేష్ట ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నారు. Scheme for Residential education for stuents in higher classes in targeted Areas (SHRESHTA 2024) గా పిలిచే ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.
SHRESHTA 2024 Admissions: కేంద్ర సామాజిక న్యాయం, సాధికార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న శ్రేష్ట పథకంలో అర్హుల ఎంపిక కోసం జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోని ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్ధుల కోసం ఈ పథకాన్ని కేంద్రం స్వయంగా నిర్వహిస్తోంది.
శ్రేష్ట పథకం ద్వారా సిబిఎస్‌ఇ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యాబోధన అందిస్తారు. 9వ తరగతితో పాటు 11వ తరగతిలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ద్వారా రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్లు కల్పిస్తారు. ఎంపికైన విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుంది. ఏటా 3వేల మంది విద్యార్ధులకు శ్రేష్ట పథకంలో అవకాశం కల్పిస్తారు. ప్రతిభావంతులైన విద్యార్ధుల్ని గుర్తించి వారికి సిబిఎస్‌ఇ రెసిడెన్షియల్ విద్యను అందిస్తారు.
శ్రేష్ట నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ (NET) ఆఫ్‌లైన్ పద్ధతిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా నిర్వహిస్తారు. ఈ పథకానికి ఎస్సీ విద్యార్ధులు మాత్రమే అర్హులు. దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల తల్లిదండ్రుల వార్షికాదాయం రెండున్నర లక్షలను మించకూడదు.పరీక్షకు హాజరయ్యేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు చేసుకోవడం ఇలా...
శ్రేష్ట ప్రవేశ పరీక్ష 2024 కోసం మార్చి 12 నుంచి ఏప్రిల్ 4వ తేదీ ఐదు గంటల వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులకు www.exams.nta.ac.in/shreshta లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తులో ఏమైనా సవరణలు, మార్పులు చేయాల్సి ఉంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు అనుమతిస్తారు. NTA వెబ్‌సైట్ నపుంచి మే 12వ తేదీ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 24వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష నిర్వహణ ఇలా...
శ్రేష్ట పరీక్షకు మూడు గంటల వ్యవధి ఉంటుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్, హిందీలో ఉంటాయి. https://exams.nta.ac.in/SHRESHTA , https://Shreshta.ntaonline.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షకు కావల్సిన అర్హతలు, పరీక్షా కేంద్రాలు, వయో పరిమితి, దరఖాస్తులో సమర్పించాల్సిన పత్రాల వివరాలు ఎన్టీఏ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. దరఖాస్తు చేయడానికి ముందు ఇన్ఫర్మేషన్ బ్రోచర్ పూర్తిగా చదవాలని సీనియర్ ఎగ్జామ్స్ డైరెక్టర్ సాధనా పరాశర్ సూచించారు. ఇన్ఫర్మేషన్ బ్రోచర్ మార్చి 12 నుంచి అందుబాటులో ఉండనుంది. మరిన్ని వివరాలకు ఎన్టీఏ హెల్ప్ డెస్క్ +91 11-40759000 లేదా shreshta@nta.ac.inకు మెయిల్ చేయొచ్చు.
సంబంధిత కథనం