AP Registrations: రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ ఉండగా వెయిటింగ్‌ అవసరం లేదు ఇక, అందుబాటులో ముందస్తు బుకింగ్-no waiting required while slot booking is available for registrations advance booking available ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Registrations: రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ ఉండగా వెయిటింగ్‌ అవసరం లేదు ఇక, అందుబాటులో ముందస్తు బుకింగ్

AP Registrations: రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ ఉండగా వెయిటింగ్‌ అవసరం లేదు ఇక, అందుబాటులో ముందస్తు బుకింగ్

Sarath Chandra.B HT Telugu
Published Feb 14, 2025 07:04 AM IST

AP Registrations: ఆంధ్రప్రదేశ్‌లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌ సేవల్ని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఇబ్బందులు లేకుండా ముందుగా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

రిజిస్ట్రేషన్ సేవల కోసం స్లాట్ బుకింగ్ సదుపాయం
రిజిస్ట్రేషన్ సేవల కోసం స్లాట్ బుకింగ్ సదుపాయం

AP Registrations: ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ సేవల్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ కోసం ముందస్తుగా అప్పాయింట్మెంట్ తీసుకునేలా డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు.

ఆన్లైన్ డేటా ఎంట్రీ సిస్టమ్ ద్వారా ప్రజలు వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డిజిటల్ గా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకునే అవకాశం ఉంటుంది.

తద్వారా డాక్యుమెంట్ రిజిస్ట్రెషన్ లు, లేదా వివాహ రిజిస్ట్రేషన్ లాంటి వివిధ సేవలను ఎంపిక చేసుకునే వీలు కలుగుతుంది. ఈ వ్యవస్థ ద్వారా టోకెన్ తీసుకోగానే సబ్ రిజిస్ట్రార్ కు ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. స్లాట్ బుకింగ్ సేవలను ఉచితంగానే అందించనున్నట్టు స్పష్టం చేసింది.

డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు అయిన స్లాట్ ను రద్దు చేసుకుంటే రూ.100, సమయం మార్పు చేస్తే రూ.200 చెల్లించాలని పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న ముందు రోజే ఆన్లైన్ ద్వారా డాక్యుమెంట్ లను అప్లోడ్ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కు సంబధించిన ఫీజులు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన ఈ సిస్టమ్ ద్వారా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను పరిశీలించి ఆమోదం తెలియచేయాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఐజీ ని ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అమలయ్యేనా…?

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దళారులు లేకుండా సేవల్ని అందించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవి మాత్రం అమలు కావడం లేదు. డాక్యుమెంట్ రైటర్లు, దళారులు లేకుండా నేరుగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం మాత్రం సాధ్యపడదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల్లో ఇదే రకమైన పరిస్థితులు ఉన్నాయి.

ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పడిగాపులు పడా ల్సిన పని లేకుండా ముందుగా స్లాట్ బుక్ చేసుకుని ఆ సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్, స్ట్రాంప్స్ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్టు జీవోలో పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ సేవలను మెరుగుప రిచే చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డైనమిక్ క్యూ మేనేజ్ మెంట్ సిస్టంను ప్రవేశపెట్టారు. దీని సాయంతో రిజిస్ట్రేషన్ చేయించుకోవా లనుకునేవారు ముందుగా అపాయింట్మెంట్(స్లాట్) బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలో కార్యాలయానికి హాజరుకావొచ్చు.

స్లాట్ బుకింగ్ ఇలా…

వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయిన వెంటనే డాక్యుమెంట్ ప్రిపరేషన్ మాడ్యూల్ కనిపిస్తుంది. ఆస్తుల వివరాలన్నీ నింపిన తర్వాత దరఖాస్తు ఐడీ జనరేట్‌ అవుతుంది. దీనితో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌, వివాహ రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయానికి వెళ్లేందుకు కోరుకున్న సమయానికి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ముందస్తు స్లాట్ బుకింగ్ ఉచితంగా చేసుకోవచ్చు. స్లాటు రద్దు చేసుకుంటే మాత్రం రూ.100, రీ షెడ్యూల్ చేసుకునేందుకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

ప్రతి రోజు సాయంత్రం 5 గంటలలోపు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. స్లాట్‌ బుకింగ్ సదుపాయం సౌకర్యాన్ని ముందుగా అన్ని జిల్లాల ప్రధాన కార్యాలయాల్లోని ఆర్వో కార్యాలయాల్లో అందుబాటులో ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ఆధారంగా అన్ని కార్యాలయాలకూ విస్తరిస్తారు. సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వ సెలవు దినాల్లో రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ.5 వేలు చెల్లించాలి.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం