AP Pensions : పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇకనుంచి వేలిముద్రల కష్టాలు ఉండవు!-new fingerprint registration scanners for pension beneficiaries in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Pensions : పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇకనుంచి వేలిముద్రల కష్టాలు ఉండవు!

AP Pensions : పింఛన్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఇకనుంచి వేలిముద్రల కష్టాలు ఉండవు!

AP Pensions : పింఛన్ల కోసం పండుటాకులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. ముఖ్యంగా వేలిముద్ర సరిగా రాక.. పాట్లు పడేవారు. ఈ కష్టాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. వేలిముద్రల కోసం కొత్తగా స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వేలిముద్రల కష్టాలకు చెక్ (istockphoto)

రాష్ట్రంలో సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో.. వేలిముద్రలు పెద్ద సమస్యగా ఉండేవి. వేలిముద్రలు సరిగా పడక లబ్ధిదారులు ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేలిముద్రల కష్టాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచి కొత్తగా వేలిముద్రల నమోదు స్కానర్లను అందుబాటులోకి తీసుకురానుంది.

ఎల్-1 స్కానర్లు..

రాష్ట్రంలో ప్రస్తుతం ఎల్‌-0 స్కానర్ల ద్వారా లబ్ధిదారుల వేలిముద్రలు వేయిస్తున్నారు. వాటి స్థానంలో ఎల్‌-1 స్కానర్లను తీసుకొచ్చారు. ఆధార్‌ సాఫ్ట్‌వేర్‌ను యూఐడీఏఐ ఆధునికీకరించడంతో.. పాత పరికరాలు ఉపయోగపడే అవకాశం లేదు. మార్చి 31వ తేదీ తర్వాత ఇవి పనిచేయవని ఆ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి కొత్త పరికరాలు ఇవ్వనున్నారు. ఒక్కో పరికరాన్ని రూ.1,989 పెట్టి కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

వేలిముద్రలు ఎందుకు..

పింఛను పొందేది అర్హులైన లబ్ధిదారులేనా అని నిర్ధారించడానికి వేలిముద్రలు తీసుకుంటారు.ఇది మోసాలను అరికట్టడానికి సహాయపడుతుంది. ప్రభుత్వ రికార్డులలో లబ్ధిదారులను గుర్తించడానికి వేలిముద్రలు ఉపయోగపడతాయి. ఇది పంపిణీ ప్రక్రియను సులభతరం చేస్తుంది. వేలిముద్రల ద్వారా పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచవచ్చు. ఇది లబ్ధిదారులకు భరోసాను ఇస్తుంది.

మోసాలకు చెక్..

కొన్నిసార్లు లబ్ధిదారులు చనిపోయిన తరువాత కూడా.. కొంతమంది వారి బంధువులు ఆ పింఛనును తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి మోసాలను వేలిముద్రల ద్వారా నివారించవచ్చు. ప్రభుత్వాలు డిజిటల్ పద్ధతులకు మారడం వలన, ఆధార్ వంటి డిజిటల్ ధ్రువీకరణ వ్యవస్థలతో వేలిముద్రలు అనుసంధానం చేస్తారు. దీనివల్ల పింఛను పంపిణీ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది. అందుకే వేలిముద్రలు తీసుకుంటారు.

పేరెంట్స్ లేని పిల్లలకు..

రాష్ట్రంలో వృద్ధాప్య పింఛన్లు, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, ఇతర సామాజిక భద్రతా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పింఛన్ లబ్ధిదారుల వివరాలను పరిశీలిస్తూ.. అర్హులైన వారికే అందేలా చర్యలు తీసుకుంటోంది. అదనంగా తల్లిదండ్రులు లేని పిల్లలకు కూడా కొత్తగా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.