AP New EV policy: ఏపీలో కొత్త ఈవీ పాలసీ విడుదల..వాహనాలపై భారీగా రాయితీలు.. పరిశ్రమలకు ప్రోత్సహకాలు..-new ev policy unveiled in ap huge subsidies on vehicles implementation for three years ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Ev Policy: ఏపీలో కొత్త ఈవీ పాలసీ విడుదల..వాహనాలపై భారీగా రాయితీలు.. పరిశ్రమలకు ప్రోత్సహకాలు..

AP New EV policy: ఏపీలో కొత్త ఈవీ పాలసీ విడుదల..వాహనాలపై భారీగా రాయితీలు.. పరిశ్రమలకు ప్రోత్సహకాలు..

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 13, 2024 10:50 AM IST

AP New EV policy: ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఊపు తెచ్చేలా కొత్త ఈవీ పాలసీను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేలా రాయితీలు ప్రకటించారు. కొనుగోలు దారులతో పాటు ఉత్పత్తిదారులకు కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్‌ పాలసీలో రాయితీలు కల్పించారు.

ఏపీలో  కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్ పాలసీ
ఏపీలో కొత్త ఎలక్ట్రిక్‌ వెహికల్ పాలసీ (istockphoto)

AP New EV policy: ఏపీలో కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. గత కొంత కాలంగా ఈవీలకు పన్ను ప్రోత్సహకాల విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో వాహనాల కొనుగోళ్లు తగ్గిపోయాయి. పొరుగు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నా ఏపీలో కొంత జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఏపీలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేలా ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

yearly horoscope entry point

2024-29 మధ్య పాలసీ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొంది. విద్యుత్తు వాహనాల తయారీదారులతోపాటు కొనుగోలుదారులకూ రాయితీలు ప్రకటించింది.

కొత్త పాలసీలో ప్రయోజనాలు ఇవే..

  • ఎలక్ట్రిక్‌ బ్యాటరీల సాయంతో నడిచే ద్విచక్రవాహనాలు, ఆటోలు, బస్సులు, రవాణా వాహనాలు, ట్రాక్టర్లకు ఇకపై ఏపీలో విక్రయ ధరలో 5 శాతం రాయితీ కల్పిస్తారు.
  • ఆర్వీఎస్ఎస్ ఆపరేటర్ నుంచి సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ తీసుకుంటే వాహనం ధరలో 10 శాతం రాయితీ లభిస్తుంది. 2027 మార్చి వరకు జరిగే విక్రయాలపై మాత్రమే ఈ ప్రోత్సాహకం లభిస్తుంది.
  • రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని విద్యుత్ వాహనాలకు ఐదేళ్లపాటు రోడ్డు ట్యాక్స్ మినహాయింపు ఇస్తారు. అయితే హైబ్రిడ్ వాహనాలకు ఈ మినహాయింపు వర్తించదు' అని పాలసీలో పేర్కొన్నారు.
  • ఎక్స్ షోరూమ్ ధరకు కూడా పరిమితి విధించింది. ద్విచక్రవాహనానికి గరిష్ఠంగా రూ. లక్ష, త్రి చక్ర వాహనానికి రూ.2 లక్షలు, సరకు రవాణా వాహనానికి రూ.5 లక్షలు, ట్రాక్టర్కు రూ.6 లక్షలు, విద్యుత్ బస్సుకు రూ.2 కోట్ల వరకు పరిమితిగా తీసుకుని ప్రభుత్వ రాయితీ వర్తింపజేస్తారు.
  • మొదటి 5 వేల ఛార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే వారికి ఖర్చులో 25% (గరిష్ఠంగా రూ. 3లక్షల) వరకు రాయితీ ఇస్తారు.

కొత్త పాలసీ లక్ష్యాలు…

  • 2029 నాటికి 2 లక్షల విద్యుత్ ద్విచక్రవాహనాలు రిజిస్టర్ చేయడం, 2029 నాటికి కనీసం 10 వేల త్రిచక్ర వాహనాలు, 20 వేల కొత్త కార్లను తీసుకురావడంతో పాటు ఆర్టీసీలో నూరు శాతం విద్యుత్ బస్సుల వినియోగం లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • 30 కి.మీ.లకు ఒక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులో తీసుకువస్తారు. ఈ-మొబిలిటీ నగరాల నిర్మాణానికి రూ.500 కోట్లతో కార్పస్ నిధి ఏర్పాటు చేస్తారు. ఈ-మొబిలిటీ స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 100 ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
  • ఈవీ రంగంతో అనుసంధానమైన భాగస్వామ్య పక్షాల నుంచి తీసుకున్న అభిప్రాయాలకు అనుగుణంగా పాలసీ విధానాలను ప్రభుత్వం రూపొందించినట్టు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, విడిభాగాల తయారీ యూనిట్లు, పబ్లిక్, ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా చార్జింగ్/ స్వాపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు.
  • రాష్ట్రంలో కొనుగోలు చేసిన విద్యుత్ వాహనాలు, రిజిస్ట్రేషన్ చేయడం, రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీస్ (ఆర్వీఎస్ఎఫ్) ఆపరేటర్లు, ఈ- వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్లు, ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు (ఏటీఎస్) ఏర్పాటు చేయడం చేస్తారు.

Whats_app_banner