Telugu News  /  Andhra Pradesh  /  Nellore Rural Mla Kotamreddy Sridhar Reddy Strong Counter To Sajjala Ramakrishna Reddy
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Comments On Sajjala : సజ్జల గుర్తుపెట్టుకో.. మీకు వీడియో కాల్స్‌ వస్తాయ్‌

04 February 2023, 16:21 ISTHT Telugu Desk
04 February 2023, 16:21 IST

Kotamreddy Sridhar Reddy Counter to Sajjala: తనకు వచ్చిన బెదిరింపు కాల్స్ పై వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఇదంతా సజ్జల కోటరీ బ్యాచ్ పని అని చెప్పారు. ఇలాంటి వాటినికి భయపడేదే లేదన్నారు. కార్పొరేటర్ పెట్టిన కేసుపై కూడా కోటంరెడ్డి మాట్లాడారు.

Nellore Rural MLA Kotamreddy Sridhar Reddy: సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. తనకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి సజ్జల కోటరీ అని తెలిసిందని.. ఇలాంటి బెదిరింపులకు భయపడనని స్పష్టం చేశారు. తనకు ఫోన్ కాల్స్ వస్తే...మీకు నెల్లూరు రూరల్ నుంచి మీకు వీడియో కాల్స్ వస్తాయని హెచ్చరించారు. వందల మందిని ప్రయోగించాని..అదిరేది, బెదిరేది లేదన్నారు. ఏందకైనా సిద్ధమేనని సవాల్ విసిరారు.

ట్రెండింగ్ వార్తలు

మౌనంగా ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లాలనుకున్నట్లు శ్రీధర్ రెడ్డి చెప్పారు. అయితే వైసీపీలోని కీలక నేతలంతా స్పందిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని అనుమానించే రీతిలో మాట్లాడుతుంటే తప్పని పరిస్థితుల్లో స్పందిస్తున్నట్లు తెలిపారు. శనివారం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి... మంత్రి కాకాణితో పాటు సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక కార్పొరేటర్ పెట్టిన కిడ్నాప్ కేసుపై కూడా కోటంరెడ్డి స్పందించారు. "తనపై పెట్టిన కేసు అక్రమం. భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడం. కానీ ఎలాంటి బెదిరింపులకు గురి చేయలేదు. ఆ సమయంలో భాస్కర్ రెడ్డి కూడా మంచిగా మాట్లాడాడు. బయటికి వచ్చి కారు కూడా ఎక్కించాడు. నన్ను పట్టుకోని బాగా ఏడ్చాడు. అంతలోనే నాపై భాస్కర్ రెడ్డితో కేసు పెట్టించారు. కిడ్నాప్ కేసు మాత్రమే కాదు… హత్యాయత్నం కేసు కూడా పెట్టుకుంటే బాగుండేది" అంటూ కోటంరెడ్డి ఘాటుగా మాట్లాడారు.

మంత్రి కాకాణి కామెంట్స్ పై కూడా కోటంరెడ్డి స్పందిస్తూ… అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వద్దామనుకుంటే నమ్మక ద్రోహమా? అని ప్రశ్నించారు. జడ్పీ ఛైర్మన్‌ చేసి రాజకీయ మెట్టు ఎక్కించిన ఆనంకు వ్యతిరేకంగా మారలేదా..? అంటూ కాకాణిని నిలదీశారు. మరోవైపు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తోనే తమ ప్రయాణమని చెప్పారు నెల్లూరు మేయర్‌ పొట్లూరి స్రవంతి. అవసరమైతే నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.

శుక్రవారం రాత్రి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసు నమోదైంది. వేపడారుపల్లికి చెందిన 22వ డివిజన్‌ కార్పొరేటరు విజయభాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో వేదాయపాళెం పోలీసులు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటూ ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్‌, కారు డ్రైవరు అంకయ్యలపై సెక్షన్‌ 448, 363ల కింద కిడ్నాప్‌కు ప్రయత్నించారని కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.