Nellore Jobs : నెల్లూరు జిల్లాలో మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు, దరఖాస్తులకు నవంబర్ 13 ఆఖరు తేదీ
Nellore Jobs : నెల్లూరు జిల్లాలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్‌లో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు నవంబర్ 13న ఆఖరు తేదీ. ఆసక్తి గల వారు నిర్ణీత సమయంలో దరఖాస్తు దాఖలు చేసుకోవాలి.
నెల్లూరు జిల్లాలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 10 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఏడాది పాటు ఉద్యోగ వ్యవధి ఉంటుంది. పనితీరు ఆధారంగా వారి సర్వీసును కొనసాగిస్తారు. ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకం జరుపుతారు. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://cdn.s3waas.gov.in/s39c82c7143c102b71c593d98d96093fde/uploads/2024/11/2024110857.pdf ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తి చేయాలి. సంబంధిత సర్టిఫికేట్లను జతచేసి, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించి దరఖాస్తును నవంబర్ 13 సాయంత్రం 5 గంటల లోపు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్, నెల్లూరు అందజేయాలి.
మొత్తం ఎన్ని పోస్టులు?
మొత్తం 10 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ల్యాబ్ టెక్నిషియన్- 3 (ఓసీ-ఉమెన్, ఎస్సీ-ఉమెన్, ఓసీ-జనరల్), ఫార్మసిస్ట్ (గ్రేడ్-lI) - 2 (ఓసీ-ఉమెన్, ఎస్సీ-ఉమెన్), డేటా ఎంట్రీ ఆపరేటర్- 2, లాస్ట్ గ్రేట్ సర్వీస్ (ఎల్‌జీఎస్)- 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
నెలవారీ వేతనం
నెలవారీ జీతాలు ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా ఉంటాయి. ల్యాబ్ టెక్నిషియన్- రూ.23,393, ఫార్మసిస్ట్ (గ్రేడ్-lI)- రూ.23,393, డేటా ఎంట్రీ ఆపరేటర్- రూ.18,450, లాస్ట్ గ్రేట్ సర్వీస్ (ఎల్‌జీఎస్)- రూ.15,000 ఉంటుంది.
వయో పరిమితి...ఫీజు
1. దరఖాస్తు దాఖలు చేసే అభ్యర్థుల వయో పరిమితి 2024 జులై 1 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.
2. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.300 ఉంటుంది. దివ్యాంగు, విడోస్‌కు ఫీజు లేదు. డీఎంఅండ్‌హెచ్‌వో, నెల్లూరు పేరుతో డీడీ తీయాలి. ఈ డీడీని అప్లికేషన్‌కు జత చేయాలి.
అర్హతలు
విద్యార్హతలు, అనుభవం ఒక్కో పోస్టుకు ఒక్కో రకంగా ఉన్నాయి.
1. ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులకు డీఎంఎల్‌డీ, బీఎస్సీ ఎంఎల్‌టీ, ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎంఎల్‌టీ (ఏడాది అప్రంటీస్) పూర్తి చేయాలి. ఏడాది పాటు కాంట్రాక్ట్ ఉంటుంది.
2. ఫార్మసిస్ట్ (గ్రేడ్-lI) పోస్టులకు ఫార్మసీలో డిప్లొమా, బి.ఫార్మసీ పూర్తి చేయాలి. ఏడాది పాటు కాంట్రాక్ట్ ఉంటుంది.
3. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు గ్రాడ్యూషన్ పూర్తి చేయాలి. అలాగే ఎంఎస్ ఆఫీస్, ఎక్స్ఎల్ తదితర బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్‌లో ఉద్యోగ వ్యవధి ఏడాది పాటు ఉంటుంది.
4. లాస్ట్ గ్రేట్ సర్వీస్ (ఎల్‌జీఎస్) పోస్టులకు పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మూడేళ్ల అనుభవం ఉండాలి. అవుట్ సోర్సింగ్ బేసిస్‌లో ఉద్యోగ వ్యవధి ఏడాది పాటు ఉంటుంది.
అప్లికేషన్‌తో జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
1. పదో తరగతి సర్టిఫికేట్
2. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్
3. అర్హత పరీక్షల ఉత్తీర్ణత ధ్రువీకరణ పత్రం
4. అన్ని పరీక్షల మార్కులు జాబితా
5. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్లు
6. ఇంటెర్న్ షిప్ సర్టిఫికేట్
7. కుల ధ్రువీకరణ పత్రం
8. నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు
9. సదరన్ సర్టిఫికేట్
10. స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్
11. ఎక్స్‌సర్వీస్ మాన్ సర్టిఫికేట్
12. ఒక ఫోటోను అప్లికేషన్ పై అతికించి సెల్ఫ్ అటెస్టడ్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ
మార్కులు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. వంద మార్కులకు గానూ 75 మార్కులు అడమిక్ ప్రతిభకు కేటాయించారు. 15 మార్కులు అనుభవానికి కేటాయించారు. 10 మార్కులు టెక్నికల్ ఎగ్జామ్‌కి వెయిటేజ్ ఇస్తారు. ఇంటర్వ్యూకి ఎటువంటి మార్కులు లేవు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం