Indian Navy Day 2022 : సాగర తీరంలో ఔరా అనేలా.. నేవీ డే విన్యాసాలు..-navy day celebrations 2022 in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Navy Day Celebrations 2022 In Visakhapatnam

Indian Navy Day 2022 : సాగర తీరంలో ఔరా అనేలా.. నేవీ డే విన్యాసాలు..

HT Telugu Desk HT Telugu
Dec 04, 2022 09:25 PM IST

Navy Day 2022 : నేవీ డే సందర్భంగా విశాఖలో యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సాగర తీరంలో భారత నేవీ ప్రదర్శనలు ఔరా అనిపించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యుద్ధ విన్యాసాలను వీక్షించారు.

నేవీ డే విన్యాసాలు
నేవీ డే విన్యాసాలు (twitter)

నేవీ డే సందర్భంగా విశాఖ(Visakhapatnam)లో నిర్వహించిన యుద్ధ విన్యాసాలను అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రధానంగా యుద్ధ విమానాలు చేస్తున్న విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాగర తీరంలో నేవీ ప్రదర్శనలు ఔరా అనిపించేలా ఉన్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. రాష్ట్రపతితోపాటుగా గవర్నర్ బిశ్వభూషణ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, శాసనసభాపతి తమ్మినేని, మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, విడదల రజని నేవీ వేడుకలను వీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

విశాఖ ఆర్ కే బీచ్(Visakha RK Beach)లో జరిగిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో శత్రువులపై దాడి చేసే విన్యాసాలు, బోట్లతో సముద్రం నుంచి వేగంగా.. ఒడ్డుకు రావడం, యుద్ధనౌక విన్యాసాలు, గగనతలంలో హెలీకాప్టర్ల సాహసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మిగ్-29 యుద్ధవిమానాల ప్రదర్శన తీరు ఆసక్తిగా తిలకించారు.

యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్(Rocket Firing) చేయడం అబ్బురపరించింది. యుద్ధనౌకల నుంచి రంగురంగుల కాంతులు చూపరులకు ఆసక్తిగా ఉంది.

రాత్రి సమయంలో సముద్రంపై విద్యుత్ కాంతులతో ధగధగ మెరిసిపోతూ.. యుద్ధనౌకలు ఆకట్టుకున్నాయి. జెమినీ బోట్ లోకి హెలికాప్టర్ నుంచి దిగిన మెరైన్ కమాండోలు సముద్ర జలాలపై వేగంగా ఒడ్డుకు దూసుకురావడం హైలెట్. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ బోట్ నుంచి హెలికాప్టర్లలోకి దాడి చేసేందుకు మెరైన్ కమాండోలు గాల్లోకి లేచారు. గగన వీధుల్లో త్రివర్ణ పతాక రెపరెపలతో హెలీకాప్టర్ విన్యాసాలు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయి.

జలాంతర్గాములతో మెరైన్ కమాండోల విన్యాసాలు ఆసక్తిగా ఉన్నాయి. ఎన్ఎస్ కంజీర్, కడ్మత్ నుంచి సముద్రంపై ఐఎన్ఎస్ దిల్లీ(INS Delhi), ఐఎన్ఎస్ సహ్యాద్రి యుద్ధనౌకలను ఉపయోగించారు. ఇక నాలుగు యుద్ధనౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు లాండింగ్, టేకాఫ్ కావడం ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంది.

IPL_Entry_Point