Narayana New Campuses : 12 రాష్ట్రాలలో 52 కొత్త క్యాంపస్‌లను ప్రారంభించిన నారాయణ విద్యాసంస్థలు
Narayana New Campuses : నారాయణ విద్యా్సంస్థలు దేశవ్యాప్తంగా తమ క్యాంపస్ ను విస్తరిస్తున్నాయి. తాజాగా 12 రాష్ట్రాల్లో 52 కొత్త క్యాంపస్ లు ప్రారంభించినట్లు నారాయణ విద్యాసంస్థల నిర్వాహకులు ప్రకటించారు. దీంతో నారాయణ క్యాంపస్ ల సంఖ్య 907కు చేరిందని వెల్లడించారు.
Narayana New Campuses : ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ విద్యాసంస్థలు...12 రాష్ట్రాలలో 52 కొత్త క్యాంపస్‌లను ప్రారంభించింది. ఈ మేరకు నారాయణ విద్యాసంస్థలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. నాణ్యమైన విద్యను అందించడంలో నారాయణ మరో ముందడుగు వేసినట్లు వెల్లడించింది. తాజా క్యాంపస్ లతో ... దేశంలోని 23 రాష్ట్రాలలో స్కూళ్లు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు అన్నీ కలిపి మొత్తం 907 క్యాంపస్‌లకు చేరాయని పేర్కొంది.
ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధిని కాక్షింస్తూ నారాయణ తన నిర్మాణాత్మక పాఠ్యాంశాలు, అధునాతన బోధనా పద్ధతులు, శారీరక, మానసిక శ్రేయస్సుపై దృష్టిని పెడుతుందని తెలిపింది. ఈ విస్తరణతో భారతదేశ విద్యా వ్యవస్థను పునర్నిర్వచించడానికి, విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధించడానికి సాధికారత కల్పించడానికి ఉపయోగపడుతోందని పేర్కొంది.
నారాయణ ఉనికి బలోపేతం
2025-26 విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులను విద్యా, వ్యక్తిగత నైపుణ్యాల పెంపొందించడానికి కొత్త క్యాంపస్‌లు వ్యూహాత్మకంగా ఏర్పాటుచేశామని నారాయణ సంస్థ నిర్వాహకులు తెలిపారు.
కొత్త క్యాంపస్ లు
- ఛత్తీస్‌గఢ్: 4 కొత్త క్యాంపస్‌లు
- తమిళనాడు: 4 కొత్త క్యాంపస్‌లు
- మధ్యప్రదేశ్: 3 కొత్త క్యాంపస్‌లు
- గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్: 2 క్యాంపస్‌లు
- అస్సాం, పంజాబ్: 1 క్యాంపస్
అదనంగా నారాయణ తెలంగాణలో 21 కొత్త క్యాంపస్‌లు, ఆంధ్రప్రదేశ్‌లో 8 కొత్త క్యాంపస్‌లను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో తన స్థానాన్ని బలోపేతం చేసుకుందన్నారు. ఈ విస్తరణ దేశవ్యాప్తంగా విద్యార్థులకు అధిక నాణ్యత విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో సంస్థ నిబద్ధతను తెలియజేస్తుందన్నారు.
నారాయణ విద్యా సంస్థల అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ, "దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో నారాయణ క్యాంపస్‌ను స్థాపించడమే మా దార్శనికత. విద్య అనేది ఉజ్వల భవిష్యత్తుకు మూలస్తంభమని మేము దృఢంగా విశ్వసిస్తున్నాం. ప్రతి బిడ్డకు దానిని అందుబాటులోకి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నాము. విద్యార్థుల శారీరక, మానసిక శ్రేయస్సును పెంపొందించడంలో తల్లిదండ్రులు, కుటుంబాలు పోషించే కీలక పాత్రను గుర్తించి, విద్యార్థులు వేరే నగరానికి వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా...వారికి అందుబాటులో నారాయణ క్యాంపస్ లు ఏర్పాటు చేస్తున్నాం.
నారాయణ కొత్త క్యాంపస్ కేవలం భౌగోళిక పరిధిని పెంచడానికి మాత్రమే కాదు, విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించడానికి అవకాశాలను సృష్టించుకోవడానికి సహాయపడతాయి. నారాయణ వినూత్న బోధనా పద్ధతులు, వ్యక్తిగత అభ్యాసం, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించి, నారాయణ విద్యా రంగంలో ప్రమాణాలను నెలకొల్పుతూనే ఉంది. కొత్త క్యాంపస్‌లు అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విద్యార్థులు వారి పూర్తి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి రూపొందించిన వాతావరణాన్ని అందిస్తాయి" అని అన్నారు.