Lokesh Yuvagalam : ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ - లోకేశ్ 3 వేల కి.మీ పాదయాత్ర ఎలా సాగిందంటే...-nara lokesh yuvagalam which will be concluded near bhogapuram of vizianagaram district on december 20 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Yuvagalam Which Will Be Concluded Near Bhogapuram Of Vizianagaram District On December 20

Lokesh Yuvagalam : ఈనెల 20న 'యువగళం' ముగింపు సభ - లోకేశ్ 3 వేల కి.మీ పాదయాత్ర ఎలా సాగిందంటే...

Maheshwaram Mahendra Chary HT Telugu
Dec 17, 2023 12:04 PM IST

Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ఈనెల 20తో ముగియనుంది. విజయనగరంలో యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

నారా లోకేశ్
నారా లోకేశ్

Lokesh Yuvagalam Padayatra: నారా లోకేశ్ చేపట్టిన సుదీర్ఘమైన పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది. 226రోజుల్లో 3132 కి.మీ.లు సాగిన యువగళం పాదయాత్ర… డిసెంబర్ 20వ తేదీన ముగియనుంది. ఈఏడాది జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర.. విజయనగరం జిల్లాలో ముగుస్తుంది. యువగళం ముగింపు సభకు టీడీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు తరలివచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రత్యేక బస్సులు తీసుకోనుంది. ఇక నారా లోకేశ్ పాదయాత్ర సాగిన తీరు చూస్తే…

ట్రెండింగ్ వార్తలు

-ఈ ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాలచెంత నుంచి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది.

-రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో97 అసెంబ్లీ నియోజకవర్గాలు,232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,094 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది.

-పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు, తారకరత్న మరణం వంటి అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామలేకుండా నారా లోకేష్ పాదయాత్ర సాగింది.

-యువగళం పాదయాత్రలో యువనేత లోకేశ్… 70 బహిరంగసభలు, 154ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకున్నారు.

-ప్రజలనుంచి రాతపూర్వకంగా 4,353వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా లోకేశ్ ను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు.

-ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు నారా లోకేశ్.

-సెల్ఫీ ఛాలెంజ్ లతో ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

-పాదయాత్రలో తమ దృష్టికి వచ్చిన క్లిష్టసమస్యలపై లోకేష్ స్పందించారు. 226రోజుల సుదీర్ఘ పాదయాత్రలో వివిధ సమస్యలపై లోకేష్ అధికార యంత్రాంగానికి 600కు పైగా లేఖలు రాశారు.

ఉమ్మడి జిల్లాల వారీగా యువగళం పాదయాత్ర వివరాలు:

1). చిత్తూరు – 14 నియోజకవర్గాలు – 45రోజులు – 577 కి.మీ.

2). అనంతపురం – 9 నియోజకవర్గాలు – 23రోజులు – 303 కి.మీ.

3). కర్నూలు – 14 నియోజకవర్గాలు – 40రోజులు – 507 కి.మీ.

4). కడప – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 200 కి.మీ.

5). నెల్లూరు – 10 నియోజకవర్గాలు – 31రోజులు – 459 కి.మీ.

6). ప్రకాశం – 8 నియోజకవర్గాలు – 17రోజులు – 220 కి.మీ.

7). గుంటూరు – 7 నియోజకవర్గాలు – 16రోజులు – 236 కి.మీ.

8).కృష్ణా జిల్లా – 6 నియోజకవర్గాలు – 8రోజులు – 113 కి.మీ.లు

9). పశ్చిమగోదావరి – 8 నియోజకవర్గాలు – 11రోజులు – 225.5 కి.మీ.

10). తూర్పుగోదావరి – 9 నియోజకవర్గాలు – 12రోజులు – 178.5 కి.మీ.

11). విశాఖపట్నం జిల్లా – 5 నియోజకవర్గాలు – 7రోజులు – 113 కి.మీ.

మొత్తం – 97 నియోజకవర్గాలు – 226రోజులు – 3132 కి.మీ.

రాయలసీమలో సుదీర్ఘ పాదయాత్రతో యువనేత లోకేష్ రికార్డు సృష్టించారు. 124రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1587 కి.మీ మేర సీమలో యువగళం పాదయాత్ర కొనసాగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇచ్చాపురం వరకు చేయాలనుకున్న యువగళం పాదయాత్రను యువనేత లోకేశ్… విశాఖ జిల్లా అగనంపూడి వద్దే ముగించాల్సి వచ్చింది.

యువగళం పాదయాత్ర బాధ్యుల వివరాలు:

1. యువగళం మెయిన్ కోఆర్డినేటర్ – కిలారి రాజేష్.

2. వ్యక్తిగత సహాయక బృందం – తాతా నరేష్, కుంచనపల్లి వినయ్, పిన్నింటి మూర్తి.

3. వాలంటీర్స్ కమిటీ – అనిమిని రవినాయుడు, మానం ప్రణవ్ గోపాల్.

4. ఫుడ్ కమిటీ – మద్దిపట్ల సూర్యప్రకాష్, లక్ష్మీపతి.

5. మీడియా కమిటీ – మెయిన్ కో-ఆర్డినేటర్ బి.వి.వెంకటరాముడు, కాసరనేని జశ్వంత్.

6. పబ్లిక్ రిలేషన్స్ కమిటీ –కృష్ణారావు, కిషోర్, మునీంద్ర, చల్ల మధుసూదనరావు. ఫోటోగ్రాఫర్స్: సంతోష్, శ్రీనివాస్, కాశీప్రసాద్.

7. అలంకరణ కమిటీ – బ్రహ్మం చౌదరి, మలిశెట్టి వెంకటేష్.

8. అడ్వాన్స్ టీమ్ కమిటీ – డూండీ రాకేష్, నిమ్మగడ్డ చైతన్య, శ్రీరంగం నవీన్ కుమార్, చంద్రశేఖర్, నారాయణస్వామి.

9. రూట్ కోఆర్డినేషన్ కమిటీ – కస్తూరి కోటేశ్వరరావు (కెకె), కర్నాటి అమర్నాథ్ రెడ్డి.

10. కరపత్రాల పంపిణీ కమిటీ – అడుసుమిల్లి విజయ్, వెంకటప్ప, వంశీ, చీరాల నరేష్.

11. సెల్ఫీ కోఆర్డినేషన్ కమిటీ – వెల్లంపల్లి సూర్య, ప్రదీప్, శ్రీధర్ చౌదరి.

12. వసతుల కమిటీ – జంగాల వెంకటేష్, నారా ప్రశాంత్, లీలాధర్, బాబి, రమేష్.

13. తాగునీటి వసతి కమిటీ – భాస్కర్, చిరుమాళ్ల వెంకట్, అనిల్.

14. సోషల్ మీడియా – అర్జున్.

IPL_Entry_Point