Nara Lokesh Yuvagalam: 24 నుంచి నారా లోకేష్ యువగళం ప్రారంభం
Nara Lokesh Yuvagalam: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. సెప్టెంబర్9వ తేదీ నుంచి పాదయాత్ర నిలిచిపోయింది.
Nara Lokesh Yuvagalam: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో నిలిచి పోయిన నారా లోకేష్ యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 24న లోకేష్ పాదయాత్రను రాజోలు తిరిగి ప్రారంభించేందుకు టీమ్ లోకేష్ ఏర్పాట్లు చేస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
సెప్టెంబర్9వ తేదీన రాజోలు నియోజక వర్గంలో పాదయాత్ర నిలిచిపోయింది. దాదాపు రెండున్నర నెలలుగా పాదయాత్ర నిలిచిపోయింది. ఈ ఏడాది జనవరిలో కుప్పంలో లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. 400రోజుల పాటు పాదయాత్ర చేయాలని షెడ్యూల్ రూపొందించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో పాదయాత్ర ఆగింది. యాత్ర ఎక్కడైతే ఆగిపోయిందో తిరిగి అక్కడి నుంచే యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు.
పాదయాత్ర ప్రారంభించిన సమయంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం లోకేష్ పాదయాత్ర ఇచ్చాపురం వరకు సాగాల్సి ఉంది. ప్రస్తుతం విశాఖతోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు. ఇదే సెంట్‌మెంట్‌తో లోకేశ్ కూడా విశాఖలోనే ముగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
లోకేష్ పాదయాత్ర విశాఖపట్నం వరకు మాత్రమే జరిగితే మరో పాదయాత్ర పది, 12 రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ కార్యక్రమాలను వేగవంతంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు కుదిరిన నేపథ్యంలో సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై దృష్టి సారించాల్సి ఉంది.
మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నెలాఖరు వరకు ఏపీలో పర్యటించే అవకాశాలు లేవు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో అక్కడ ప్రచార కార్యక్రమాల్లో పవన్ పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించక ముందే యువగళం పాదయాత్రను ముగించాలని భావిస్తున్నారు
డిసెంబర్ నుంచి వపన్ కూడా ప్రచారంలోగి దిగుతారని ఈ నేపథ్యంలోనే యువగళం పాదయాత్రను ముందే ముగించాలనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు చంద్రబాబు నాయుడిపై నమోదైన కేసులలో కోర్టుల్లో ఖచ్చితంగా ఊరట లభిస్తుందని చెబుతున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో క్వాష్ పిటిషన్‌తో పాటు ఇతర కేసుల చిక్కుల నుంచి చంద్రబాబు బయటప డతారని విశ్వసిస్తున్నారు.
సుప్రీంకోర్టులో మంగళవారం ఏదొక తీర్పు వెలువడ వచ్చని టీడీపీ వర్గాలు ఆశిస్తున్నాయి. బాబు కేసుల్లో కోర్టు తీర్పు మరికొద్ది రోజులు జాప్యమైనా లోకేశ్ పాదయాత్ర 24నే ప్రారంభం అవుతుందని, ఇందులో మార్పేమీ ఉండదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.