Nara Lokesh: ఫ్లెక్సీల నిషేధంపై నారా లోకేష్ ఆగ్రహం-nara lokesh demands for postponement of ban on flexi printing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Demands For Postponement Of Ban On Flexi Printing

Nara Lokesh: ఫ్లెక్సీల నిషేధంపై నారా లోకేష్ ఆగ్రహం

HT Telugu Desk HT Telugu
Sep 30, 2022 02:03 PM IST

Nara Lokesh ఏపీలో ఫ్లెక్సీల వినియోగంపై ఏకపక్షంగా నిషేధం విధించడాన్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తప్పు పట్టారు. ప్రత్యామ్నయాలు చూపకుండా లక్షలాది మంది ఆధారపడి ఉన్న రంగంపై నిషేధం విధించడాన్ని ప్రశ‌్నించారు.

undefined
undefined

Nara lokesh కరోనా సంక్షోభంతో తీవ్రనష్టాన్ని చవిచూసిన ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ప్రభుత్వ హడావిడి నిర్ణయం మూలిగే నక్క పై తాటికాయ పడిన చందంగా ఉందని లోకేష్‌ విమర్శించారు. ముందస్తు ప్రణాళిక లేకుండా, సంబంధిత శాఖ అధికారులతో కనీసం ఒక సమావేశం కూడా ఏర్పాటు చెయ్యకుండా విశాఖ వేదికగా జరిగిన సభలో ప్లాస్టిక్ ఫ్లెక్స్ బ్యాన్ చేస్తున్నాం అని ప్రకటించడంతో, ఈ రంగం పై ఆధారపడిన సుమారు 7 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని లోకేష్ ఆరోపించారు.

ట్రెండింగ్ వార్తలు

రాష్ట్రంలో ఎన్ని ఫ్లెక్సీ యూనిట్లు ఉన్నాయి, ఎంత మంది ఈ రంగం పై ఆధారపడి ఉన్నారు, నిషేధం విధిస్తే తలెత్తే పరిణామాలు ఏంటి... పరిశ్రమ పై ఆధారపడిన వారికి కలిగే నష్టం ఎంత మేర ఉంటుంది... ముందస్తు సమాచారం, ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ప్రభుత్వం ఎటువంటి కసరత్తు చెయ్యలేదని, ముఖ్యమంత్రి నిర్ణయం ప్రకటించిన నెల లోపే... సంబంధిత పరిశ్రమపై ఆధారపడిన వారితో ఎటువంటి చర్చలు జరపకుండా... జి.ఓ. నెం: 65 తీసుకొచ్చారని ఆగ్రహం Nara Lokesh వ్యక్తం చేశారు.

కఠిన ఆంక్షలు, ఫైన్లు విధిస్తూ నవంబర్ 1 నుండి నిషేధాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రంగాన్ని నమ్ముకున్న లక్షలాది మంది రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జీవనోపాధి కోల్పోతున్నాం అంటూ ఆవేదనతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన వారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు నిర్వహించారని, జిల్లా కలెక్టర్లను, మంత్రులను, శాసనసభ్యులను కలిసి సమస్యను వివరించినా ఎటువంటి ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ బాధను చెప్పుకుందాం అనుకుంటే కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉందంటూ వారి ఆవేదన చెందుతున్నారని Nara Lokesh చెప్పారు.

పర్యావరణంపై ఉన్నట్టుండి ప్రేమ ఒలకబోయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేసిందని, ఒక పక్క మీరు ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలను ప్రోత్సహిస్తూ పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నారని, విశాఖలో పచ్చని రుషి కొండని బోడి కొండగా మార్చారని, ఫ్లెక్సీ పరిశ్రమ పై నిషేధం విధించేందుకు చూపించిన వేగం వైసిపి కనుసన్నల్లో నడుస్తున్న ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాని అరికట్టడంలో చూపిస్తే పర్యావరణానికి మేలు చేసినట్టు అవుతుందని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1500 ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయని, వీరంతా సుమారుగా 10 నుండి 30 లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టారు. బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని కొంతమంది... అప్పులు చేసి కొంతమంది ఈ యూనిట్లను నెలకొల్పారు. నెలవారీ ఈఎంఐ కట్టడమే కష్టం అవుతున్న సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం వీరిని కోలుకోలేని దెబ్బతీసిందనిNara Lokesh విమర్శించారు.

ప్రస్తుతం ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ ఎదుర్కుంటున్న తీవ్ర సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వం వారి సమస్యలు అధ్యయనం చేసేందుకు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో కమిటీ ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేశారు. ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన వారు కోరుతున్న విధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లెక్సీ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు పై అధ్యయనం చెయ్యాలన్నారు.

ప్రస్తుతం ఉన్న యూనిట్లను కాటన్ ఫ్లెక్సీ యూనిట్లుగా మార్చుకోవడానికి సుమారుగా 15 లక్షల రూపాయిల ఖర్చు అవుతుందని, ఈ మార్పు కోసం ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందించాలన్నారు. నవంబర్ 1 నుండి ప్రభుత్వం అమలు చెయ్యాలి అనుకుంటున్న నిషేధాన్ని కనీసం ఏడాది పాటు వాయిదా వేసి ప్రస్తుతం ఉన్న యంత్రాలను అప్ గ్రేడ్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. హడావిడి నిర్ణయం, చర్యలతో ఫ్లెక్సీ ప్రింటింగ్ పరిశ్రమ పై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలను అంధకారం చెయ్యకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి ప్రత్యామ్నాయం చూపించాలని Nara Lokesh కోరారు.

WhatsApp channel

టాపిక్