Nara Lokesh On YCP Govt: జగనోరా వైరస్ కి టీడీపీనే వ్యాక్సిన్-nara lokesh comments on ysrcp govt ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Comments On Ysrcp Govt

Nara Lokesh On YCP Govt: జగనోరా వైరస్ కి టీడీపీనే వ్యాక్సిన్

HT Telugu Desk HT Telugu
Dec 01, 2022 09:57 AM IST

వైసీపీ సర్కార్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ కి టీడీపీనే వ్యాక్సిన్ అంటూ ట్వీట్ చేశారు.

నారా లోకేశ్
నారా లోకేశ్

Nara Lokesh Slams YS Jagan: వైసీపీ సర్కార్ పై నారా లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి టౌన్ సీతానగరంలో బుధవారం నిర్వహించిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... రాష్ట్రానికి పట్టిన జగనోరా వైరస్ కి టీడీపీనే వ్యాక్సిన్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు

వైసీపీ గూండాల బెదిరింపులకు తెలుగుదేశం నేతలు భయపడరని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. జగన్ రెడ్డి రాష్ట్రానికి పట్టిన ఖర్మ అని వ్యాఖ్యానించారు. మంగళగిరి నియోజకవర్గంలోని సమస్యలను టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని చెప్పారు. సీతానగరం ప్రాంతంలోని వాసులకు ఇళ్ల పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు.

chandrababu fires on ys jagan: మరోవైపు ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చంద్రబాబు(Chandrababu) ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ(YCP)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్​కి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉందా అని చంద్రబాబ ప్రశ్నించారు. బాబాయిని చంపిన వ్యక్తి రాష్ట్రాన్ని పాలించటం, ఇదేం ఖర్మ అని చంద్రబాబు విమర్శించారు. బాబాయ్​ని చంపినంత సులువుగా తనను చంపొచ్చని, ఇప్పుడు లోకేశ్​ను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ చేసే.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

తన బాధ, ఆవేదన అంతా రాష్ట్రం కోసమేనని చంద్రబాబు అన్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు నెల(Polavaram Project) వద్దకు వెళ్లి.. పనులను పరుగులు పెట్టించానని చెప్పారు. టీడీపీ(TDP) హయాంలో 72 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక..రివర్స్ టెండర్ తీసుకొచ్చారన్నారు. మూడు సంవత్సరాలో 72 శాతం పూర్తయితే.. జగన్ వచ్చాక.. మూడేళ్లలో డయాఫ్రమ్ వాల్ కూడా బాగు చేయలేదని విమర్శించారు. నిర్వాసితులకు ఆదుకోలేదన్నారు. పోలవరం కేంద్రం ప్రాజెక్టు అని, నిర్మాణానికి డబ్బులు కూడా కేంద్రమే ఇస్తుందన్నారు.

'వైసీపీ గెలిస్తే పోలవరం(Polavaram) ముంచేస్తారు. ఈ విషయాన్ని అప్పుడే చెప్పాను. ముద్దులు పెడితే మోసపోవద్దు. పిడిగుద్దులు ఉంటాయని ఎప్పుడో అన్నాను. ప్రజల్లో చైతన్యం కోసమే ఇదేం ఖర్మ(Idhem Kharma) మన రాష్ట్రానికి కార్యక్రమం చేపట్టాం. మీలో చైతన్యం వచ్చి ధైర్యంగా ముందుకు రావాలి. ఏపీ రైతుల నెత్తిలో రూ.2.7 లక్షల తలసరి అప్పు ఉంది. మీటర్లు పెట్టి రైతుల మెడలో ఉరితాళ్లు వేస్తున్నారు.' అని చంద్రబాబు అన్నారు.

IPL_Entry_Point