TDP Lokesh గ్లోబల్ సమ్మిట్‌ పేరుతో ఫేక్ పెట్టుబడులనంటున్న లోకేష్-nara lokesh comments on vizag global investment summit ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Comments On Vizag Global Investment Summit

TDP Lokesh గ్లోబల్ సమ్మిట్‌ పేరుతో ఫేక్ పెట్టుబడులనంటున్న లోకేష్

HT Telugu Desk HT Telugu
Mar 06, 2023 12:26 PM IST

TDP Lokesh 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది చంద్రబాబేనని, గ్లోబల్‌ సమ్మిట్ పేరుతో వైసీపీ నాయకులు ఫేక్ సమ్మిట్ నిర్వహించాలని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ హయంలో జిల్లాల వారీగా ఏర్పాటైన పరిశ్రమల జాబితాను మ్యాప్‌ రూపంలో విడుదల చేశారు.

పీలేరులో నారా లోకేష్
పీలేరులో నారా లోకేష్

TDP Lokesh2014-2019 మధ్యకాలంలో చంద్రబాబు అన్ని జిల్లాల్లో అనేక పరిశ్రమలను నెలకొల్పారన్నారు. 2014-19 మధ్య ఏపీలో జిల్లాల వారీగా టీడీపీ ఏర్పాటు చేసిన పరిశ్రమలపై వైసీపీ ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారని, దానిలో 2014-19 మధ్య 39,450 పరిశ్రమలు తెచ్చామని, వాటి ద్వారా 5,13,350ఉద్యోగాలు ఇచ్చామని లోకేష్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాకు కియా, బర్జర్ పెయింట్స్, జాకీ పరిశ్రమలు తెచ్చామని, కడపకు వెల్ స్పన్ కంపెనీని తీసుకొచ్చామన్నారు. చిత్తూరుకు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చామని, వీటిలో టీసీఎల్, ఫాక్స్ కాన్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, ఫాక్స్ కాన్, డిక్సన్ కంపెనీలు తెచ్చామన్నారు. కర్నూలుకు సిమెంట్ కంపెనీలు, సోలార్ ఉత్పత్తి కేంద్రాలు తీసుకువచ్చామని చెప్పారు.

నెల్లూరు హీరోమోటార్స్, అపోలో టైర్స్, సుజల వంటి వందలాది పరిశ్రమలు, ప్రకాశం ఏషియన్ పేపర్ మిల్స్, గుంటూరు, కృష్ణాకు అశోక్ లైల్యాండ్,కేసీపీ, హెచ్.సీ.ఎల్, ఉభయగోదావరిలో అనేక ఫిషరీస్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తెచ్చామన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్ తో ఒప్పందం, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాంజియెంట్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు తెచ్చామని చెప్పారు.

టీడీపీ హయాంలో 31శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో రాయలసీమకు, 23శాతం ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు వచ్చాయని, వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఇచ్చిన సమాధానమే అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ కంటే ఏపీకి అధికంగా రూ.19,500కోట్ల ఎఫ్.డీ.ఐ వచ్చిందని, క 3.5శాతానికి నిరుద్యోగత తగ్గిందని చెప్పారు.

గంజాయి ఫుల్..ఉద్యోగాలు నిల్….

2019 నుంచి 2023 వరకు ప్రభుత్వం నిద్రపోయిందని, వైసీపీ పాలనలో పెద్దఎత్తున పీపీఏలు రద్దు చేసి అనేక పరిశ్రమలను ఏపీ నుండి తరిమేశారన్నారు. వైసీపీ నాయకుల బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు పారిపోయాయన్నారు. కేంద్రం కూడా పీపీఏలు రద్దు చేయవద్దని లేఖలు రాసిందని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల దేశం పరువు కూడా పోతుందని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి సూచిస్తే జగన్ పట్టించుకోలేదన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతాం. ఏపీలో మాత్రం పెట్టబడులు పెట్టబోమని లూలూ సంస్థ బహిరంగంగా ప్రకటించిందని, ఈ కంపెనీని ఏపీ నుండి తరిమేయకపోతే రాష్ట్రంలో రూ.2వేల కోట్లు పెట్టబడులు పెట్టేదన్నారు. 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు.

వేదాంత గ్రూపు కూడా చాలా స్పష్టంగా ఏపీలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని చెప్పింది. జగన్ పాలసీలు మొత్తం మార్చేస్తున్నారని చెప్పిందని గుర్తు చేశారు. జగన్సీఎం అయ్యాక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలూ, హోలీటెక్, అమర్ రాజా, మెగాసీడ్ పార్క్, జాకీ, ఏషియన్ పేపర్ పల్ప్ కంపెనీలు పారిపోయాయి.

అమర్ రాజా కంపెనీ కూడా తెలంగాణకు వెళ్లిపోయింది. దీనివల్ల ఏపీ యువత 20వేల ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ఏపీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 14వ స్థానంలో ఉందని, ఝార్ఖండ్ కంటే మనం వెనుకబడి ఉన్నామని చెప్పారు.

ఏపీలో ఉద్యోగాలు నిల్...గంజాయి ఫుల్ అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కేవలం లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే అని, ఏ ప్రభుత్వం అయినా ఒప్పందాలు జరిగినప్పుడు వాటిని బహిరంగంగా అధికారికంగా ప్రకటిస్తారని, గతంలో అలాగే చేశారని, ఇప్పుడు మాత్రం ఒప్పందాల పుస్తకాలు, సంతకాలు చూపించడం లేదన్నారు.కాగితాలు లేని ఎంఓయూ లు మార్చుకున్నారని, 378 ఎంఓయూలు జరిగితే 70కంపెనీల పేర్లు మాత్రమే బయటపెట్టారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో ఆన్ లైన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు చూపించే వాళ్లమన్నారు.

ఇండోసోల్ అనే కంపెనీ డైరెక్టర్లు అందరూ పులివెందులకు చెందిన వారని, . 2022లో కంపెనీగా వచ్చింది. మూలధన పెట్టుబడి లక్ష మాత్రమే. ఇటువంటి కంపెనీ రూ.76వేల కోట్ల పెట్టబడులు పెడతామని చెప్పిందంటే ఎలా నమ్మాలన్నారు. ఈ కంపెనీకి 25వేల ఎకరాల భూమిని కర్నూలు, కడప, కృష్ణాలో జగన్ కట్టబెడుతున్నారని ఆరోపించారు.

ఏబీసీ అనే మరో కంపెనీకి 120కోట్ల టర్నోవర్, దీనిలో కేవలం 250మంది మాత్రమే ఉద్యోగం చేస్తుంటే , రూ.1.20లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఒప్పందాలు అయ్యాయంటే ఎలా నమ్మాలన్నారు. పెట్టుబడుల్లో సోలార్ ఎనర్జీ 71శాతం ఉంటుంది. దీనికి రూ.9,57,139కోట్లు అన్నారు.

మెగావాట్ కు రూ.4.5కోట్ల నుండి 5 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని, 2లక్షల మెగావాట్లకు 10లక్షల ఎకరాలు కావాలన్నారు. భారతదేశంలో 2022 జూన్ లెక్కల ప్రకారం.అత్యధిక విద్యుత్ వాడకం 2.5లక్షల మెగావాట్లు మాత్రమే అన్నారు. ఏపీలో అత్యధిక విద్యుత్ వాడకం 11,448మెగావాట్లు మాత్రమే అని, దీనికి 2లక్షల మెగావాట్ల ఉత్పత్తి అంటూ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. విశాఖలో జరిగింది లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే అని ఆరోపించారు.

WhatsApp channel

టాపిక్