Nara Lokesh : మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి - యువగళం పాదయాత్రలో లోకేశ్-nara lokesh comments on meters for motors ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Nara Lokesh Comments On Meters For Motors

Nara Lokesh : మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి - యువగళం పాదయాత్రలో లోకేశ్

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 02, 2023 09:52 AM IST

Yuva Galam Pada Yatra Updates:మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టాలని పిలుపునిచ్చారు నారా లోకేశ్. శనివారం నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మీదుగా సాగిన పాదయాత్రలో మాట్లాడిన… దేశ చరిత్రలో 100 పథకాలను రద్దు చేసిన సీఎం జగన్ కే దక్కుతుందని మండిపడ్డారు. బిల్డప్ తప్ప చేసిందేమీ లేదంటూ సెటైర్లు విసిరారు.

యువగళం పాదయాత్రలో లోకేశ్
యువగళం పాదయాత్రలో లోకేశ్

Nara Lokesh Yuva Galam Pada Yatra: నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 143వ రోజు(శనివారం) సర్వేపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా ముత్తుకూరులో ఏర్పాటు చేసిన సభలో లోకేశ్‌ మాట్లాడారు. మంత్రి కాకాణి టార్గెట్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కోర్టు దొంగ కాకాణి.. ఎమ్మెల్యేలను తనపైకి పంపిస్తున్నాడని విమర్శించారు. తనపై కోడిగుడ్లు వేయించాడని ఆరోపించారు. ఊరుకో సత్యనాదెళ్లను తయారు చేస్తానని చెబుతున్న జగన్‌ ఊరుకో అనంతబాబును తయారు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు

"రాష్ట్రాన్ని గంజాయి వ్యాపారంతో నింపాడు. సైకో జగన్‌కు బిల్డప్‌ తప్ప ఏమీ లేదు. పన్నులతో ప్రజలపై బాదుడే బాదుడు. దేశ చరిత్రలో 100 పథకాలను రద్దు చేసిన ముఖ్యమంత్రి జగన్‌. జాబ్‌ క్యాలెండర్‌ లేదు.. మెగా డీఎస్సీ లేదు. వచ్చేది టీడీపీ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి. ఈ ప్రభుత్వం మైనార్టీలను వేధించింది. ఎమ్మెల్యే అనిల్‌కు సీటు లేదని చెప్పడంతో ఫ్రస్టేషన్‌తో ఏదేదో మాట్లాడుతున్నాడు" అని నారా లోకేశ్‌ విమర్శించారు.

ఇక పాదయాత్రలో భాగంగా లోకేశ్ ను కుమ్మరమిట్ట గ్రామస్తులు కలిశారు. తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఓ వినతిపత్రం సమర్పించారు." అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.... బీసీల అభివృద్ధిని ఈ సీఎం పూర్తిగా మర్చిపోయారు. చదువుతో సంబంధం లేని ఉద్యోగాలు చేయాల్సి దుస్థితి నెలకొంది. నిత్యావసర సరకుల ధరలు పెంచి, ప్రజల ఆదాయాన్ని దోచుకుంటున్నాడు. బీసీ హాస్టళ్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. బీసీల సంక్షేమానికి సబ్సిడీలు, రైతులకు ఇచ్చే రాయితీలు తొలగించారు. ఈ ప్రభుత్వం బీసీలను నాశనం చేసింది. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.... బీసీల ఓట్లతో గద్దెనెక్కి, అధికారంలోకి వచ్చాక తీవ్రంగా మోసగించిన బీసీ ద్రోహి జగన్ అని మండిపడ్డారు. గత నాలుగేళ్లలో బీసీలకు చెందాల్సిన రూ.75,760 కోట్లను జగన్ దారి మళ్లించారని ఆరోపించారు. ప్రతియేటా జాబ్ కేలండర్ విడుదల చేసి, 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని మాట ఇచ్చి, మడమ తిప్పాడని చెప్పారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించిన బిసిలపై దాడులు చేయడం, హతమార్చడం నిత్యకృత్యంగా మారిందన్న లోకేశ్.... ఈ ప్రభుత్వం 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టించి వేధించిందన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని స్పష్టం చేశారు.

సర్వేపల్లి నియోజకవర్గం కృష్ణపట్నంకు చెందిన ఉప్పు భూముల రైతులు, రైతు కూలీలు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నారా లోకేశ్ మాట్లాడుతూ...భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, పోర్టులు నిర్మాణం సమయంలో నిర్వాసితులకు పరిహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో జీఓ ఇచ్చినా ఇంతవరకు పరిహారం చెల్లించకపోవడం దురదృష్టకరమన్నారు. ఉప్పుభూముల రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వానికి లేఖరాస్తానని చెప్పారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే టిడిపి ప్రభుత్వం ఉప్పుభూముల రైతులకు వడ్డీతో సహా పరిహారం చెల్లిస్తుందన్నారు.

WhatsApp channel