నారా లోకేశ్.. యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) 47వ రోజు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని తీర్పునిచ్చారని లోకేశ్ అన్నారు. అరాచకస్వామ్యంపై అంతిమంగా విజయం ప్రజాస్వామ్యానిదేనని చెప్పారు. అంబేడ్కర్ రాజ్యాంగానికి రాజారెడ్డి రాజ్యాంగం తల వంచిందని లోకేశ్ పేర్కొన్నారు.,'అరాచకస్వామ్యంపై అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే. ఇది జగన్ ఓటమి-జనం గెలుపు. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి అన్నా.. పులివెందుల పూల అంగళ్ల వద్ద నీ గెలుపు నినాదం మారుమోగింది. ఇక మిగిలింది వై నాట్ పులివెందుల. తిరుగులేని తీర్పు ఇచ్చిన పట్టభద్రులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను.' అని లోకేశ్ అన్నారు.,నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రెండో రోజు కొనసాగుతోంది. 47వ రోజు నల్లచెరువు మండలం చిన్నపాల్లోళ్ల పల్లి నుంచి ప్రారంభమైంది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి నారా లోకేశ్ నడిచారు. సంజీవుపల్లి వద్ద స్థానికులతో మాట్లాడారు. పెద్ద ఎల్లంపల్లి వద్ద మహిళలు, చిన్నారులతో ముచ్చటించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పాదయాత్ర(Padayatra) నల్లచెరువు చేరుకోగానే చేనేత కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని లోకేశ్ కు వినతిపత్రం ఇచ్చారు.,భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీగా గెలిచినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు శనివారం రాత్రి ఆందోళనకు దిగారు. జేఎన్టీయూ కాలేజీ మెయిన్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఆందోళనలో కలెక్టర్,జాయింట్ కలెక్టర్ వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనలో మాజీ మంత్రులు పరిటాల సునీత(Paritala Sunitha), కాల్వ శ్రీనివాసులుతో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.,ఆ తర్వాత భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి ఎట్టకేలకు డిక్లరేషన్ ఫారం ఇచ్చారు. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆయనకు డిక్లరేషన్ ఫారం అందించారు. ఆయన వెంట కాలవ శ్రీనివాసులు, పార్థసారథి, టీడీపీ నేతలు, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీగా రామగోపాల్‌రెడ్డి గెలిచినట్టు అధికారులు శనివారం రాత్రే ప్రకటించారు. కానీ ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు.,