Muchumarri : యూట్యూబ్ వీడియోలు చూసి ఘాతుకం, మృతదేహానికి రాళ్లు కట్టి నదిలో పడేసి- ముచ్చుమర్రి కేసులో షాకింగ్ విషయాలు
Muchumarri Incident : ముచ్చుమర్రి బాలిక హత్యాచారం ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశామని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. బాలికకు చాక్లెట్ ఆశచూపి ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆపై గొంతు నులిమి హత్య చేశారు.
Muchumarri Incident : నంద్యాల జిల్లా ముచ్చుమర్రి బాలిక హత్యాచారం కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు మైనర్లు యూట్యూబ్ వీడియోలు చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. పార్కులో ఆడుకుంటున్న బాలికను చాక్లెట్ ఆశచూపి దగ్గర్లోని దేవాలయంలోకి తీసుకెళ్లి ముగ్గురు బాలురు లైంగిక నేరానికి పాల్పడ్డారు. అత్యాచారం అనంతరం బాలికను గొంతు నులిమి హత్యచేశారు. ఆ పిల్లల తల్లిదండ్రులు, వారిని రక్షించడానికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఒక రాయికి కట్టి కృష్ణా నదిలో పడేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
" ముచ్చుమర్రికు చెందిన బాలిక అదృశ్యంపై జులై 7వ మిస్సింగ్ కేసు నమోదు చేశాం. ముగ్గురు మైనర్లు బాలికకు చాక్లెట్ ఆశ చూపి ఆలయంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపారు. మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలురులను అదుపులోకి తీసుకొని విచారణ చేశాం. బాలికను అత్యాచారం చేసిన తర్వాత గొంతు నులిమి హత్య చేశారు. ఆ తర్వాత కేసీ కెనాల్ వద్దకు తీసుకెళ్లి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఓ బాలుడి తండ్రి బాలిక మృతదేహన్నీ ఒక సంచిలో పెట్టి రాళ్లు వేసి కృష్ణా నదిలో పడేశారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశాం. నిందితులపై ఫోక్సో యాక్ట్, గ్యాంగ్ రేప్, మర్డర్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. బాలిక మృతదేహం ఆచూకీ కోసం ఆరు స్పెషల్ టీమ్ లతో గాలింపు చర్యలు కొనసాగుతు న్నాయి" -ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా
ఐదుగురి అరెస్టు
ఈ కేసులో ముగ్గురు బాలురు మీద ఏ1, ఏ2, ఏ3 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. వీరికి సహాయం చేసిన బాలురి బంధువులలో ఇద్దరు మీద ఏ4, ఏ5 కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశామని చెప్పారు. బాలిక మిస్సింగ్ కేసును గ్యాంగ్ రేప్, మర్డర్, పోక్సో యాక్ట్ కింద మారుస్తామన్నారు. బాలిక మృతదేహం కోసం శ్రీశైలం రిజర్వాయర్ లో ఆరు బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, స్కూబా డైవర్స్, అధునాతన టెక్నాలజీతో, డ్రోన్ కెమెరాలు, అండర్ వాటర్ స్కానర్ల సహాయంతో బాలిక మృతదేహాన్ని గాలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. డాగ్ స్క్వాడ్స్, టెక్నికల్ టీమ్స్ లతో సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఎలాగైనా బాలిక మృతదేహాన్ని కనిపెడతామని ఎస్పీ అన్నారు. బాలిక మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు.
అసలేం జరిగింది?
నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం, ఆపై హత్యకు గురైంది. జులై 7న తోటి స్నేహితులతో కలిసి పాత ముచ్చుముర్రి లోని పార్కులో ఆడుకున్న చిన్నారి అదృశ్యం అయింది. దీంతో సాయంత్రం నుంచి తన బిడ్డ కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలిక అదృశ్యం అయినట్లు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఒంటరిగా పార్కులో ఉన్న బాలికను ముగ్గురు బాలురు ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, ఆ పై కాలువలోకి తోసేసి హత్యకు పాల్పడినట్లు పోలీసులు ముందు భావించారు. 14-16 ఏళ్లలోపు వయసున్న ఈ ముగ్గురు బాలురు అత్యాచారం చేసిన విషయాన్ని బాలిక ఇంట్లో చెబుతుందన్న భయంతోనే గొంతు నులిమి హత్య చేసి కాలువలోకి తోసేసినట్లు ముందు చెప్పారు. ఆ తర్వాత ఊరి సమీపంలోని స్మశానంలో పాతిపెట్టినట్లు చెప్పారు. చివరికి రాళ్లు కట్టి కృష్ణా నదిలో పడేశామని చెప్పారు. దీంతో పోలీసుల బాలిక మృతదేహం కోసం గాలిస్తున్నారు.
సంబంధిత కథనం