Mulayam Singh Yadav : ఎన్టీఆర్, ములాయం సింగ్ క్లోజ్ అని మీకు తెలుసా?-mulayam singh yadav close friendship with senior ntr ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Mulayam Singh Yadav Close Friendship With Senior Ntr

Mulayam Singh Yadav : ఎన్టీఆర్, ములాయం సింగ్ క్లోజ్ అని మీకు తెలుసా?

Anand Sai HT Telugu
Oct 11, 2022 05:08 PM IST

Mulayam Singh Yadav Passes Away : యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్‌ కన్నుమూశారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు ఆయన మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. అయితే దివంగత ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీ రామారావుతో ములాయం సింగ్ యాదవ్ కు సన్నిహిత సంబంధాలు ఉండేవి.

ఎన్టీఆర్, ములాయం సింగ్ యాదవ్
ఎన్టీఆర్, ములాయం సింగ్ యాదవ్

ములాయం సింగ్ యాదవ్(Mulayam Singh Yadav) మృతితో తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆయనకు తెలుగు రాష్ట్రాలతో ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. దివంగత ఎన్టీఆర్(NTR)తో ప్రత్యేక అనుబంధం ఉండేది. కొన్ని సందర్భాల్లో కలిసి కూడా పని చేశారు. ఒకరికి ఒకరు అండగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

నేషనల్‌ ఫ్రంట్‌(National Front) ఛైర్మన్‌గా ఎన్టీఆర్‌ విజయవాడలో సమావేశానికి పిలిస్తే, ఆ సమావేశానికి హాజరైన ముఖ్యనేతల్లో ములాయం ఒకరు. ఎన్టీఆర్, ములాయం ఇద్దరూ ఒక రకమైన నేతలు, వారి మధ్య మంచి వ్యక్తిగత సంబంధాలను కొనసాగించారు. పాలనపై అభిప్రాయాలను కూడా పంచుకునేవారు.

1989లో నేషనల్ ఫ్రంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఇరువురు నేతలు కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ కూడా సమాజ్ వాదీ పార్టీ(samajwadi party), ములాయం పార్టీకి మద్దతుగా ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో ప్రచారం చేశారు. ఇద్దరికీ ప్రధానమంత్రి కావాలనే ఆకాంక్ష ఉండేదని చెబుతుంటారు కొందరు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ములాయం కేంద్ర రక్షణ మంత్రి అయ్యారు.

1980లో ములాయం సింగ్ లోక్ దళ్ పార్టీ(Lokdal Party) అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ తర్వాత పార్టీని ములాయం సింగ్ జనతాదళ్ లో విలీనం చేశాడు. 1992 లో సమాజ్ వాదీ పార్టీ ఏర్పాటు అయింది. నేషనల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా ఉండేవాడు. నేషనల్ ఫ్రంట్ కు చెందిన నేతలు విజయవాడ(Vijayawada)కు వచ్చిన సమయంలో ములాయం సింగ్ యాదవ్ కూడా ఉన్నారని కొంతమంది నేతలు గుర్తుచేసుకుంటున్నారు.

ఏపీలో ఎన్టీఆర్‌ గద్దె దిగాక.. భాస్కరరావు సీఎం అయ్యారు. ఈ సమయంలో ములాయం సింగ్ ఎన్టీఆర్‌కు అండగా నిలిచారు. చాలా సలహాలు ఇచ్చారని చెబుతుంటారు. ఎన్టీఆర్ కు ధైర్యం చెప్పారని అంటుంటారు.

అంతేకాదు.. ఎన్టీఆర్, ములాయం ఇద్దరికీ రాజకీయాల్లో ఒకేలాంటి అనుభవాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎన్టీఆర్ పార్టీపై పట్టు కోల్పోవాల్సి వచ్చింది. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. ములాయం యాదవ్ విషయానికి వస్తే.. తండ్రి యూపీకి సీఎంగా చేయడంతో ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) చివరికి పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు.

IPL_Entry_Point