YSRCP: ఎంపీ మాధవ్ పై వేటు..? సజ్జల హింట్ ఇచ్చేశారా….!-mp gorantala madhav is likely to be suspended from ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Mp Gorantala Madhav Is Likely To Be Suspended From Ysrcp

YSRCP: ఎంపీ మాధవ్ పై వేటు..? సజ్జల హింట్ ఇచ్చేశారా….!

HT Telugu Desk HT Telugu
Aug 04, 2022 07:56 PM IST

mp gorantala madhav video call: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్.. కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మరోవైపు పార్టీ అధినేత జగన్ కూడా తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. ఏ క్షణమైనా మాధవ్ పై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

ఎంపీ మాధవ్ పై వేటు..?
ఎంపీ మాధవ్ పై వేటు..? (twitter)

గోరంట్ల మాధవ్.... ఏపీ రాజకీయాల్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చి పార్లమెంట్ లో అడుగుపెట్టారు. పోలీస్ ఆఫీసర్ అయిన మాధవ్... జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసరటంతో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీఆర్ఎస్ తీసుకున్న ఆయన... వైసీపీలో చేరారు. హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి విక్టరీ కొట్టారు. సీన్ కట్ చేస్తే... ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఒక న్యూడ్ వీడియో కాల్... హాట్ టాపిక్ గా మారింది. ఆయన తీరుపై ప్రతిపక్షాలు మాటల దాడిని పెంచాయి. ఇక సొంత పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఆయనపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతుందనే టాక్ వినిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

సీఎం సీరియస్... సజ్జల కీలక వ్యాఖ్యలు

cm jagan serious on mp madhav: మాధవ్‌కు సంబంధించి న్యూడ్ వీడియో కాల్ విషయంపై పార్టీ అధినేత, సీఎం జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల నుంచి ఆరా తీసినట్లు సమాచారం. ఏ క్షణమైనా మాధవ్‌ను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ అంశంపై పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మాధవ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను మాధవ్‌ ఖండించారని... అది మార్ఫింగ్‌ వీడియో అని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ అంశంపై పోలీసు విచారణ జరుగుతోందన్న ఆయన... మార్ఫింగ్‌ వీడియో కాదని తేలితే మాధవ్ పై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచేలా ఎవరైనా వ్యవహరిస్తే తమ పార్టీ సహించదు తేల్చి చెప్పారు.

అసలేం జరిగిందంటే?..

madhav video call: ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళ పట్ల వీడియో కాలింగ్‌లో అసభ్యంగా ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. రెండ్రోజుల క్రితం ఎంపీ గోరంట్ల .. ఓ మహిళతో వీడియో కాలింగ్‌లో మాట్లాడుతూ... వీడియో కాల్‌లో తన దుస్తులు లేకుండా ఉన్న చిత్రాలను మహిళకు చూపించడంతో ఆమె సీరియస్‌గా తీసుకుని వైరల్‌ చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోపై గోరంట్ల మాధవ్‌ కూడా స్పందించారు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తాను జిమ్‌ చేసేటప్పటి వీడియోలను మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశారని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పలువురు టీడీపీ నేతల పేర్లను ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే జిల్లా ఎస్పీ, సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తామని.. కుట్రలు, దుర్మార్గాలను బయటపెడతామని మాధవ్‌ ప్రకటించారు. ఇదిలా ఉంటే మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ సీరియస్ గా నే స్పందించింది. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలంటూ సవాల్ విసిరింది.

మొత్తంగా ప్రతిపక్షాలే కాదు సొంత పార్టీ నేతల్లోనూ ఎంపీ మాధవ్ వ్యవహారం చర్చనీయాంశం కావటంతో... ఏ క్షణంలో ఎలాంటి ప్రకటన వస్తుందో అన్న డిస్కషన్ నడుస్తోంది. ఇందుకు సజ్జల చేసిన కీలక కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి.

IPL_Entry_Point