Telugu News  /  Andhra Pradesh  /  Mp Adala Prabhakar Reddy Appointed As Ysrcp Coordinator For Nellore Rural Constituency
సీఎం జగన్ తో అదాల ప్రభాకర్ రెడ్డి
సీఎం జగన్ తో అదాల ప్రభాకర్ రెడ్డి (twitter)

YSRCP: కోటంరెడ్డి ఔట్.. నెల్లూరు రూరల్‌ ఇన్‌ఛార్జిగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి

02 February 2023, 20:45 ISTHT Telugu Desk
02 February 2023, 20:45 IST

YSRCP coordinator for Nellore Rural constituency: నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కోటంరెడ్డికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టేసింది వైసీపీ అధినాయకత్వం. ఇన్‌ఛార్జిగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించగా.. ఆయన స్థానంలో అదాల ప్రభాకర్ రెడ్డిని నియమించింది.

Nellore Rural Constituency: నెల్లూరు రూరల్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. కోటంరెడ్డి వ్యవహరం నేపథ్యంలో...కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనేతలతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ అధినేత, సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించారు. నేతల మధ్య విభేదాలు, పరిష్కారం, తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

ఇన్‌ఛార్జిగా ఆదాల

నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధినాయకత్వం నియమించింది. ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తప్పించింది. ఇన్‌ఛార్జి నియామకం కోసం పలువురు పేర్లను అధిష్ఠానం పరిశీలించినప్పటికీ.. చివరకు ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. రూరల్‌ ఇంఛార్జ్‌గా నియమించడంపై ఆదాలా ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఆదాలనే పోటీ చేస్తారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్ తో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సీఎం జగన్ ను కలిసిన తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఫోన్‌ కాల్‌ను ఆయన స్నేహితుడే రికార్డింగ్‌ చేశారని స్పష్టం చేశారు. కోటంరెడ్డిపై చర్యలకు సంబంధించి త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు.వెళ్లే ముందు ఏదో ఒక విమర్శలు చేసి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన కామెంట్స్… నెల్లూరు రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆదేశాలతోనే తన ఫోన్ ట్యాప్ చేశారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. నమ్మకం లేని చోట పని చేయలేనని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో ఉంటానని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు.