Manchu Manoj : మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు వర్సిటీ ఘటనపై పరస్పర ఫిర్యాదులు-mohan babu university issue manchu manoj filed complaint at chandragiri police station ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Manchu Manoj : మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు వర్సిటీ ఘటనపై పరస్పర ఫిర్యాదులు

Manchu Manoj : మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు వర్సిటీ ఘటనపై పరస్పర ఫిర్యాదులు

Bandaru Satyaprasad HT Telugu
Jan 16, 2025 03:52 PM IST

Manchu Manoj : మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి పోలీస్ స్టేషన్ కు చేరింది. నిన్న మోహన్ బాబు వర్సిటీ వద్ద ఘటనపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. తనపై, తన సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు వర్సిటీ ఘటనపై పరస్పర ఫిర్యాదులు
మరోసారి రచ్చకెక్కిన మంచు ఫ్యామిలీ, మోహన్ బాబు వర్సిటీ ఘటనపై పరస్పర ఫిర్యాదులు

Manchu Manoj : మంచు ఫ్యామిలీలో విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నిన్న తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద హైడ్రామా చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. యూనివర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్ ను పోలీసులు అడ్డుకున్నారు. తన తాత, నానమ్మల సమాధులకు దండం పెట్టుకునేందుకు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించారు. అయితే కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో లోపలకు అనుమతించలేమని పోలీసులు మనోజ్ ను అడ్డుకున్నారు. అనంతరం ఆయనను లోపలకు పంపించారు. ఈ సమయంలో మోహన్ బాబు, మనోజ్ బౌన్సర్ల మధ్య ఘర్షణ జరిగింది.

yearly horoscope entry point

ఈ నేఫథ్యంలో గురువారం చంద్రగిరి పోలీస్ స్టేషన్ కు మంచు మనోజ్ వెళ్లారు. నిన్న జరిగిన పరిణామాలపై డీఎస్పీతో మనోజ్ చర్చించారు. కోర్టు ఇంజంక్షన్ ఆర్డర్లు తనకు అందకపోవడం మాట్లాడారు. మనోజ్ తో పాటు ఆయన భార్య మౌనిక, లీగల్ టీమ్ ఉన్నారు. మంచు మనోజ్, మౌనిక దంపతులు చంద్రగిరి పోలీసుస్టేషన్ లో మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనపై, తన భార్య మౌనిక, అనుచరులపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంటిలోకి తనను అనుమతించకపోవడంపై పోలీసులను ప్రశ్నించారు. శాంతి భద్రతల కారణంగా తిరుపతి వదిలి వెళ్లాలని మంచు మనోజ్‌కు పోలీసులు సూచించారు. ఫిర్యాదు చేసిన అనంతరం మనోజ్ దంపతులు మల్లయ్యగారిపల్లెకు వెళ్లిపోయారు.

ఇంటికి వస్తే గేట్లు మూసివేశారు

పోలీస్ స్టేషన్ ఫిర్యాదు అనంతరం మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ...పండుగకు ఇంటికి వస్తే గేట్లు వేశారని, తన వాళ్లపై దాడి చేశారని ఆవేదన చెందారు. నిన్న మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద తన అనుచరులు పళణి, వినాయకపై ఎంబీయూ సిబ్బంది హేమాద్రి నాయుడు, కిరణ్ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. తన కుటుంబంలో జరుగుతున్న ఘటనలు బాధాకరం అన్నారు. పండుగకు ఇంటికి వస్తే గేట్లు మూసివేశారని, తాత, నానమ్మల సమాధులకు నివాళులు అర్పించేందుకు వెళ్తే అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వాళ్లపై దాడి చేయడమే కాకుండా, గేట్లు దూకి వెళ్లినట్లు తనపై ఫిర్యాదు చేశారని ఆవేదన చెందారు.

చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారు

ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా, తనపై అభిమానులు ప్రేమ చూపిస్తున్నారని మనోజ్‌ అన్నారు. తనతో సమస్య ఉంటే మాట్లాడాలని, తాను ఎక్కడికి పారిపోలేదన్నారు. తన వాళ్ల వాహనాల్లో చక్కెర పోయడం, కట్టిన బ్యానర్లు తొలగించడం ఏంటని మండిపడ్డారు. డబ్బులిచ్చి, కిరాయి మనుషులతో తిరిగే వాడిని కాదన్నారు. పండుగ సమయంలో తన వాళ్లను పిలిపించి మనోజ్ తో ఉండకూడదని బెదిరించారన్నారు. నలుగురు పెద్ద మనుషులను పిలిచి, అన్నదమ్ములతో మాట్లాడితే సరిపోయే చిన్న విషయాన్ని పెద్దది చేస్తున్నారన్నారు. నారావారిపల్లెకు వెళ్లి మంత్రి లోకేశ్ ను కలవడంపై మంచు మనోజ్ స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగా కలవడానికే అని స్పష్టం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం