Mla Quota Mlc: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు, ఐదు స్థానాల్లో జనసేనకు ఒకటి కేటాయింపు…-mla quota mlc from janasena alloted to naga babu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mla Quota Mlc: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు, ఐదు స్థానాల్లో జనసేనకు ఒకటి కేటాయింపు…

Mla Quota Mlc: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు, ఐదు స్థానాల్లో జనసేనకు ఒకటి కేటాయింపు…

Sarath Chandra.B HT Telugu

Mla Quota Mlc: జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్సీ స్థానం ఖరారైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాగబాబు పేరు తరచూ వార్తల్లోకి వస్తోంది. తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా నాగబాబు పేరును చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన భేటీలో నిర్ణయించారు.

ఎమ్మెల్యే కోటాలో నాగబాబు పేరు ఖరారు

Mla Quota Mlc: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. గ్రాడ్యుయేట్లు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడం, ఎమ్మెల్యేల కోటా భర్తీకి నోటిఫికేషన్ వెలువడటంతో అభ్యర్థుల ఎంపిక కసరత్తు మొదలైంది. జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అంగీకారం కుదిరింది.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సోమవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో నాగబాబు అభ్యర్థిత్వం ఖరారైనట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు సహా పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు, అభ్యర్ధుల ఎంపికపై ఇద్దరూ కొద్ది సేపు చర్చించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఎన్ని కలు జరగనున్న ఐదు స్థానాల్లో ఒక దానిని నాగబాబుకు ఇవ్వాలని నిర్ణయించారు. రాజ్యసభ ఎన్నికల సమయంలోనే నాగబాబు పేరు చర్చకు వచ్చింది. అంతకు ముందు టీటీడీ ఛైర్మన్ రేసులో కూడా వినిపించింది. రాజ్యసభ ఎన్నికల సమయంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు.

సోమవారం సీఎం చంద్రబాబు అసెంబ్లీలో కూర్చుని ఉండగా.. పవన్ కల్యాణ్ ఆయన వద్దకు వెళ్లారు.అసెంబ్లీలో కొద్ది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరూ కలిసి సీఎం ఛాంబర్‌కు వెళ్లారు. బడ్జెట్లో వివిధ శాఖలకు కేటాయింపుల పై పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలు ముఖ్యమంత్రితో చెప్పినట్టు తెలుస్తోంది.

మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాతా సుఖీభవ పథకాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదా రుల పనులు చాలా వరకు చేశామని.. తాగునీటి సరఫరాపై ఎక్కువ దృష్టి పెట్టామని చంద్రబాబుకు పవన్ వివరించారు.

ఉపాధి హామీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ నిధులు రాబట్టుకుని పెద్దఎత్తున పనులు చేయాల్సిన అవసరంపై చర్చించారు. రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రికి పవన్ కల్యాణ్ సూచించారు.

ప్రస్తుతం మండలిలో జనసేన తరపున పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. మంత్రి వర్గంలో ప్రస్తుతం పవన్‌తో పాటు కందుల దుర్గేష్‌ ఉన్నారు. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించడంతో మూడో మంత్రి పదవి కూడా జనసేనలో అదే సామాజిక వర్గానికి దక్కనుంది.

టీడీపీలో భారీగా ఆశావహులు..

టీడీపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఆశిస్తున్న వారి జాబితా భారీగా ఉంది. ఎన్నికల పొత్తులో భాగంగా సీట్లు దక్కని వారంతా ఎమ్మెల్సీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. చంద్రబాబును, లోకేష్‌ను ప్రసన్నం చేసుకోడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, అశోక్‌ బాబు వంటి నేతలుఎమ్మెల్సీ స్థానం కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ ఆశిస్తున్న పలువురు నేతలు అసెంబ్లీలో చక్కర్లు కొడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లను ప్రసన్నం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సోమవారం మొదలైంది.

యనమల రామకృష్ణుడు, బీటీ నాయుడు, ఆశోక్బాబు, దువ్వారపు రామారావు, జంగా కృష్ణమూర్తిల పదవీకాలం ఈ నెల 28తో ముగుస్తోంది. శాసనసభలో కూటమి పార్టీలకే అన్ని స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది. ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో మిగిలిన నాలుగు స్థానాలపై పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ కూడా ఒక స్థానాన్ని కోరే అవకాశం ఉంది.

మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పీతల సుజాత, కేఈ ప్రభాకర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, విశాఖకు చెందిన మహ్మద్ నజీర్ అసెంబ్లీలో దర్శనం ఇచ్చారు. దువ్వారపు రామారావుకు మళ్లీ అవకాశం కల్పించాల్సిందిగా ముఖ్యమంత్రిని కోరాలని విశాఖ జిల్లాకు చెందిన ఎమ్మె ల్యేలు సోమవారం రాత్రి సమావేశమై నిర్ణయించారు. శాసనసభ ఎన్నికల్లో పొత్తులతో పోటీ చేసే అవకాశం కోల్పోయిన వారంతా ఎమ్మెల్సీ కోసం పోటీపడుతున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం