MLA Koneti Adimulam : ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ సీరియస్ - పార్టీ నుంచి సస్పెండ్, ఆదేశాలు జారీ
MLA Satyavedu suspended : సత్యేవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు రావటంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆదేశాలను జారీ చేశారు.
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఘటనపై తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి.
చంద్రబాబుకు మహిళ ఫిర్యాదు!
టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియో సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి.. ఎమ్మెల్యేగా గెలిచిన కోనేటి ఆదిమూలం లైంగిక కార్యకలాపాల వీడియో బయటికి వచ్చింది.
ఎమ్మెల్యే తనపై చేసిన అఘాయిత్యానికి సంబంధించిన వీడియోను.. బాధితురాలు తాజాగా విడుదల చేసింది. ఈ వీడియో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై బాధితురాలు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసింది. ఈ లేఖలో కీలక విషయాలను ప్రస్తావించింది. బాధిత మహిళ దృష్టికి తీసుకువచ్చిన విషయాలపై టీడీపీ అధినాయకత్వం దృష్టిపెట్టడంతో… ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలను జారీ చేసింది.