Cat Missing : హమ్మయ్యా.. మా పిల్లి దొరికేసిందోచ్-missing pet cat found after one day in east godavari ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Missing Pet Cat Found After One Day In East Godavari

Cat Missing : హమ్మయ్యా.. మా పిల్లి దొరికేసిందోచ్

HT Telugu Desk HT Telugu
Dec 11, 2022 06:25 PM IST

Pet Cat : జంతువులను కన్నబిడ్డల్లా చూసుకునేవారు చాలామందే కనిపిస్తారు. అవి తప్పిపోతే.. తల్లడిల్లిపోతారు. ఓ కుటుంబం కూడా తమ పిల్లి తప్పిపోయిందని వెతకని చోటు లేదు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

జంతువులను ప్రాణంగా చూసుకునేవారు చాలామంది ఉన్నారు. అయితే అవి తప్పిపోయినప్పుడు నిద్రాహారాలు కూడా మానేస్తారు. కారణం వాటి మీద ఉన్న ప్రేమ.. వాటితో ఉన్న అనుబంధం. కాసేపు అవి కనిపించకుండా.. పోతే.. ఇక తట్టుకోలేరు. కుక్కలు(Dogs), ఆవులు, గేదెల విషయంలో యజమానులు ఎక్కువగా వెతకడం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఓ కుటుంబం మాత్రం తమ పిల్లి(Cat) కనిపించకుండా పోయిందని.. చాలా బాధపడ్డారు. చివరకు దొరికింది.

ట్రెండింగ్ వార్తలు

తూర్పు గోదావరి(East Godavari) జిల్లా మలికిపురానికి చెందిన వ్యాపారి జాన భగవాన్ ఓ పిల్లిని పెంచుతున్నారు. హైదరాబాద్(Hyderabad)లో రూ. 50 వేలు పెట్టి తెచ్చిన పర్షియన్ జాతి పిల్లి(persian cat) అది. శుక్రవారం వారి పిల్లి తప్పిపోయింది. ఇంటి తలుపులు తీసి ఉండటంతో.. అది బయటకు వెళ్లింది. అస్సలు తిరిగి రాలేదు. ఇక ఆ కుటుంబం తట్టుకోలేకపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా(Social Media)లోనూ చెప్పారు. ఎవరికైనా కనిపిస్తే.. తెచ్చి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.

ఇంట్లో నుంచి వెళ్లిన పిల్లిని కొన్ని కుక్కలు చూశాయి. దానిపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. దీంతో అక్కడే ఉన్న కొంతమంది రక్షించారు. ఎవరిదో తెలియక రాజమహేంద్రవరం(Rajamahendravaram) తరలించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయం పిల్లి ఓనర్.. భగవాన్ కు తెలిసింది. వెంటనే వెళ్లి పిల్లిని తెచ్చుకున్నారు. తన పిల్లి దొరికేసిందని సంబరపడుతున్నారు.

గతంలో ఇలాంటి ఘటనే రేణిగుంట(Renigunta) పరిధిలోనూ జరిగింది. ఓ పిల్లి కోసం గుజరాత్ లోని సూరత్ కు చెందిన జంట రోజుల తరబడి వెతికింది. అక్కడ బట్టల వ్యాపారి జేఈష్ ఆయన భార్య మీనాకు పెళ్లై.. 17 ఏళ్లు అయింది. పిల్లలు లేరు. ఓ పిల్లిని తెచ్చి పెంచుకున్నారు. సొంత బిడ్డలా చూసుకున్నారు. ఇదే సమయంలో ఓసారి తిరుమల(Tirumala) దర్శనం చేసుకునేందుకు వచ్చారు.

దర్శనం అయిపోయాక.. రేణిగుంట స్టేషన్లో ట్రైన్ కోసం ఎదురుచూశారు. ఇదే సమయంలో పిల్లి(Cat) కనిపించకుండా పోయింది. తమ పిల్లిని వెతికి పెట్టాలని చాలామందిని కోరారు. ఈ సమయంలో కొంతమంది వారి దగ్గర డబ్బులు తీసుకుని.. వెతికిపెడతామని చెప్పినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. చాలా రోజులుపాటు రేణిగుంట ఏరియాలో పిల్లికోసం వెతికి.. ఇక తిరిగి వెళ్లిపోయారు.

IPL_Entry_Point