Lokesh Future CM : ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా... కాబోయే సీఎం నారా లోకేశ్- మంత్రి టీజీ భరత్-minister tg bharath is minister lokesh tdp future became chief minister ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh Future Cm : ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా... కాబోయే సీఎం నారా లోకేశ్- మంత్రి టీజీ భరత్

Lokesh Future CM : ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా... కాబోయే సీఎం నారా లోకేశ్- మంత్రి టీజీ భరత్

Lokesh Future CM : 'ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా టీడీపీ భవిష్యత్ నారా లోకేశ్, కాబోయే ముఖ్యమంత్రి ఆయనే' అని మంత్రి టీజీ భరత్ అన్నారు. దావోస్ లో పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా... కాబోయే సీఎం నారా లోకేశ్- మంత్రి టీజీ భరత్

Lokesh Future CM : ఏపీలో పదవుల కోసం కొట్లాట మొదలైంది. డిప్యూటీ సీఎం హోదా కోసం మొదలైన ఫైట్...ఇప్పుడు సీఎం స్థాయికి చేరింది. లోకేశ్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటూ టీడీపీ నేతలు, మంత్రులు గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. పార్టీలో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా లోకేశ్ భవిష్యత్ సీఎం అంటూ ప్రకటించేస్తున్నారు. వ్యక్తిగత ప్రకటనలను పార్టీపై రుద్దొద్దని అధిష్టానం ప్రకటన వచ్చిన గంటల వ్యవధిలోనే మంత్రి టీజీ భరత్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బృందంతో దావోస్ వెళ్లిన మంత్రి టీజీ భరత్ లోకేశే భవిష్యత్ సీఎం అంటూ ప్రకటన చేశారు. దీంతో ఇప్పుడు లోకేశ్ డిప్యూటీ సీఎం చర్చ నుంచి సీఎంకు టర్న్ అయ్యింది.

దావోస్ లో తెలుగు పారిశ్రామికవేత్తల సదస్సుల్లో మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ...ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్‌ ముఖ్యమంత్రి లోకేశ్ అంటూ కుండబద్దలు కొట్టారు. "175 ఎమ్మెల్యేలు, 25 మంది లోక్ సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీల్లో స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి చదివిన వాళ్లు ఎవరూ లేరు ఒక్క లోకేశ్ తప్ప. లోకేశ్ చాలా ఉన్నత చదువులు చదివారు. ఆయనకు ఎప్పుడు ఏం చేయాలో పూర్తిగా తెలుసు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా టీడీపీకి ఫ్యూచర్ లోకేశ్. కాబేయే ముఖ్యమంత్రి లోకేశ్" అని మంత్రి టీజీ భరత్ అన్నారు.

లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా డిమాండ్

మంత్రి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించాలని టీడీపీ నేతల నుంచి వస్తోన్న డిమాండ్లపై పార్టీ అధిష్ఠానం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలను ఆదేశించింది. ఈ అంశంపై ఎవరూ మీడియా ముందు బహిరంగ ప్రకటనలు చేయొద్దని సూచించింది. ఏ నిర్ణయమైనా కూటమి నేతలు కూర్చొని మాట్లాడుకుంటారని ప్రకటించింది. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీపై రుద్దవద్దని ప్రకటనలో పేర్కొంది.

సీఎం చంద్రబాబు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు పర్యటనలో...కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ..నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలని ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మద్దతు పలికారు. లోకేశ్ కు ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అనంతరం పలువురు నేతలు ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ, రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంను చేయాలని బహిరంగ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా బహిరంగ ప్రకటన చేస్తుండడంతో అధిష్ఠానం అలర్ట్ అయ్యింది. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారు చెప్పడం సరికాదని టీడీపీ అధిష్ఠానం భావించింది. ఇలాంటి సున్నితమైన అంశాలపై కూటమి నేతలు కూర్చొని చర్చించి నిర్ణయం తీసుకుంటారని స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ నేతలను ఆదేశించింది.

సంబంధిత కథనం