YCP On Chandrababu: నిజమే ఇవే మీకు చివరి ఎన్నికలు... చంద్రబాబుకు YCP కౌంటర్-minister seediri appalaraju and amarnath fires on chandrababu comments on elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Minister Seediri Appalaraju And Amarnath Fires On Chandrababu Comments On Elections

YCP On Chandrababu: నిజమే ఇవే మీకు చివరి ఎన్నికలు... చంద్రబాబుకు YCP కౌంటర్

మంత్రి సీదిరె అప్పలరాజు
మంత్రి సీదిరె అప్పలరాజు (facebbok)

minister seediri appalaraju fires on chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రులు ఫైర్ అయ్యారు. ఎన్ని డ్రామాలు ఆడినా జనం ఆయన్ను నమ్మరని అన్నారు సీదిరి అప్పలరాజు. చంద్రబాబుకే కాదు టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలు అని మంత్రి అమర్ నాథ్ అన్నారు.

minister seediri appalaraju fires on chandrababu: కర్నూలు రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్ అయ్యారు. 2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి అని... టీడీపీకి కూడా సమాధి కట్టే ఎన్నికలని వ్యాఖ్యానించారు.గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన... మరోసారి ఆయన భార్య పేరును ప్రస్తావించారని, ఇదంతా ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాల కోసం ఎంతకైనా చంద్రబాబు దిగజారుతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు.

ట్రెండింగ్ వార్తలు

వికేంద్రీకరణకు వ్యతిరేకంగా సీమ జిల్లాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారని... ఇదంతా అమరావతిలో ఉన్నవారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నమని మంత్రి వ్యాఖ్యానించారు. మొన్నటివరకు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు చంద్రబాబు వ్యతిరేకమా..? కాదా..? అని చెప్పాలని డిమాండ్ చేశారు. దమ్ముంటే ఇదే విషయంపై బహిరంగ ప్రకటన చేయాలని సవాల్ విసిరారు.

తనయుడు లోకేష్‌పై చంద్రబాబుకు ఆశలు లేవన్నారు మంత్రి సీదిరి. తీవ్ర మానసిక ఒత్తిడిలో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా జగన్ ను ఏం చేయలేరని స్పష్టం చేశారు. జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని... ఇలాంటి వాటిని సహించేది లేదన్నారు. వెన్నుపోటు, నమ్మకద్రోహమే చంద్రబాబు పెట్టుబడులని మండిపడ్డారు. చంద్రబాబును చూసి వైసీపీ భయపడదని స్పష్టం చేశారు.

ఇవే చివరి ఎన్నికలు - మంత్రి అమర్ నాథ్

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని.. చంద్రబాబుకే కాదు టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలు అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు ఎవర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పాలన్నారు. అలా చెప్పలేకపోతే 2024 ఎన్నికలే చంద్రబాబు చివరి ఎన్నికలు అవుతాయన్నారు.

chandrababu sensational comments: కర్నూలు జిల్లాలోని మూడు రోజుల పర్యటనలో భాగంగా.. బుధవారం పత్తికొండ సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించి అసెంబ్లీకి పంపించాలని.. టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఈ సారి గెలిపించకుంటే ఇవే తన చివరి ఎన్నికలు అవుతాయని వ్యాఖ్యానించటం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై స్పందించిన వైసీపీ… చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తోంది.

WhatsApp channel