AP Electricity: వ్యవసాయానికి పగటిపూటే 9గంటల విద్యుత్ సరఫరా చేయాలన్న పెద్దిరెడ్డి-minister peddireddy wants to provide nine hours of electricity to agriculture in ap ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Electricity: వ్యవసాయానికి పగటిపూటే 9గంటల విద్యుత్ సరఫరా చేయాలన్న పెద్దిరెడ్డి

AP Electricity: వ్యవసాయానికి పగటిపూటే 9గంటల విద్యుత్ సరఫరా చేయాలన్న పెద్దిరెడ్డి

Sarath chandra.B HT Telugu
Dec 21, 2023 05:40 AM IST

AP Electricity: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి పగటిపూటే తొమ్మిది గంటల విద్యుత్ అందించాలని మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది అదనంగా మరో 1600మెగావాట్ల విద్యుత్ పంప్డ్‌ స్టోరేజీలతో వస్తుందన్నారు.

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి

AP Electricity:) రైతులకు వ్యవసాయం కోసం ఉచిత విద్యుత్ ను అందించడంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ మందంజలో ఉందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పగటిపూట తొమ్మిది గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ ను అందించడం ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం ఇంధనశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

yearly horoscope entry point

ఈ ఏడాది కృష్ణపట్నం, ఎన్టిటిపిఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 1600 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురాగలిగినట్టు చెప్పారు. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసిన జెన్కో అధికార యంత్రాంగాన్ని అభినందించారు. పీక్ లోడ్ అవసరాల కోసం పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ ల ద్వారా అదనపు విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నామన్నారు. ఇవి వినియోగంలోకి వస్తే రాష్ట్ర అవసరాలు తీరడంతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా విద్యుత్ ను విక్రయించే సామర్థ్యంను సాధిస్తామని చెప్పారు.

వ్యవసాయంకు పగటిపూట తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్ ను అందించాలన్న సీఎం సంకల్పంలో భాగంగా తక్కువ ఉత్పత్తి వ్యయం అయ్యే సోలార్ విద్యుత్ పై దృష్టి సారించినట్టు చెప్పారు. ఇందుకోసం కేంద్రప్రభుత్వ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నామని మొత్తం 7200 మెగావాట్ల విద్యుత్ ను, యూనిట్ రూ.2.49 ధరతో సెకీ నుంచి కొనుగోలు చేసి, రైతులకు ఉచితంగా సరఫరా చేయనున్నామని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై కూడా భారం తగ్గుతుందన్నారు.

ఇటీవలే 13 ట్రాన్స్ కో సబ్ స్టేషన్లను వర్చ్యువల్ గా ప్రారంభించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడకూడదనే లక్ష్యంతో ఇంధన శాఖ అన్ని చర్యలు తీసుకుంటోందని, అవసరమైన చోట్ల కొత్త సబ్ స్టేషన్లను నిర్మిస్తోందన్నారు. మొత్తంగా ఈ నాలుగేళ్ళలోనే ఇంధనశాఖ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా పెంచుకోవడంలో, పగటిపూట రైతులకు తొమ్మిది గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను అందించడంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందన్నారు.

వచ్చే ఏడాది నుంచి పోలవరం లో ఒక యూనిట్ ద్వారా హైడల్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్ ఉత్పత్తికి ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇప్పటికే వ్యవసాయేతర భూములను ఎకరానికి ఏటా రూ.30వేలు చెల్లిస్తూ, ఆ భూముల్లో సోలార్, విండ్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. దీనిని రాబోయే రోజుల్లో మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

డిస్కంల పరిధిలో పంపిణీ నష్టాలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గే బకాయిల వసూళ్ళపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో లీగల్ టీంలను ఏర్పాటు చేయాలన్నారు.

Whats_app_banner