Lokesh interview with students : విద్యార్థుల ప్రశ్నలు.. నారా లోకేష్ ఆసక్తికర సమాధానాలు-minister nara lokesh spoke face to face with students in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Lokesh Interview With Students : విద్యార్థుల ప్రశ్నలు.. నారా లోకేష్ ఆసక్తికర సమాధానాలు

Lokesh interview with students : విద్యార్థుల ప్రశ్నలు.. నారా లోకేష్ ఆసక్తికర సమాధానాలు

Basani Shiva Kumar HT Telugu
Jan 04, 2025 04:05 PM IST

Lokesh interview with students : ఇక్కడ చదువుకున్న యువతకు ఇక్కడే ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని.. మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా పని చేస్తున్నామని చెప్పారు. యువత బ్రెయిన్ గెయిన్ చేయడానికి అన్నిచర్యలు తీసుకుంటున్నామన్నారు.

నారా లోకేష్
నారా లోకేష్

విజయవాడ పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. విద్యార్థుల ప్రశ్నలు.. మంత్రి లోకేష్ సమాధానాలు ఇలా ఉన్నాయి.

yearly horoscope entry point

కళాశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్ల అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. కాలేజీ సంరక్షణ ఇబ్బందిగా ఉంది. మీరు మా బంగారు భవిష్యత్తును నిర్మిస్తారని నమ్ముతున్నాం. కళాశాల పక్కనే బాలికల వసతి గృహం ఉంది. వరదల సమయంలో క్రిమికీటకాల వల్ల అక్కడి విద్యార్థినులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మరోవైపు బాయ్స్ హాస్టల్ కూడా ఉంది. ఆ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉంది. అక్కడి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. మేము మీ స్థాయికి చేరుకునేలా సహకారం అందించండి- షణ్ముక్, ఇంటర్, బైసీపీ

మీరు నాకన్నా పెద్దస్థాయికి చేరాలన్నదే నా ఆకాంక్ష. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నేతృత్వంలో భారత్ లో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయి. పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. షణ్ముక్ కోరిన విధంగా తప్సనిసరిగా కాంపౌండ్ వాల్, హాస్టళ్ల మరమ్మతులకు చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల మరమ్మతులు, అభివృద్ధికి రూ.5వేల కోట్లు అవసరం. ఎలా సమీకరించాలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కళాశాలలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి అడిషనల్ క్లాస్ రూమ్స్, పెయింటింగ్స్, ప్లే గ్రౌండ్, ల్యాబ్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం-లోకేష్

సమాజంలో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులను చిన్నచూపు చూస్తారు. ప్రైవేటు కాలేజీలతో సమానంగా మమ్మల్ని చూడటానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు?-మయూరి, సెకండ్ ఇయర్, ఎంపీసీ

ప్రైవేటురంగంలో జూనియర్ కాలేజీలు పిల్లలు కేటగిరైజ్ చేసి సబ్జెక్టు వారీగా ఎక్సపర్ట్‌లతో శిక్షణ ఇస్తున్నారు. ప్రభుత్వ కాలేజిల్లో కూడా కొచ్చన్ బ్యాంకు, మోడల్ పేపర్ల విధానాన్ని తెస్తున్నాం. విద్యార్థుల పనితీరును తెలుసుకునేలా తల్లిదండ్రుల వాట్సాప్‌కు లింకు చేస్తాం. వివిధ సబ్జెక్టులో పర్ఫామెన్స్ సప్లిమెంటేషన్ కోసం.. ఐఐటీ మద్రాసుతో ఒప్పందం చేసుకున్నాం. పని గంటలను గంటన్నర పెంచాం. కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే విద్యాసంవత్సరానికి ఇవన్నీ పూర్తిచేస్తాం- లోకేష్

యువగళంలో 3 వేలకు పైగా కి.మీ.ల పాదయాత్ర చేశారు. మీ ఫిట్ నెస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, మీ ఇన్సిపిరేషన్ ఎవరు?- ఎం.రాజేష్, ఎంపీసీ

ఫిట్ నెస్ కన్నా సంకల్పం అవసరం. మార్పుకోసమే విద్యాశాఖను తీసుకున్నాను. రోడ్ లెస్ ట్రావెల్ చేసి కష్టతరమైన రహదారిని సులభతరం చేసుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే ఆ శక్తి మనకు వస్తుంది. నాకు ముగ్గురు వ్యక్తులు ఇన్సిపిరేషన్... లిక్వానియో, సింగపూర్ ప్రధానిగా పనిచేశారు. మత్స్సకారులు ఉన్న చిన్న ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి.. అందరి సమస్యల గురించి తెలుసుకుంటారు, మంచి ఐడియాలను ఇంప్లిమెంట్ చేస్తారు. చంద్రబాబు క్రమశిక్షణకు మారుపేరు. 75 సంవత్సరాల వయసులో అందిరకంటే స్పీడ్ గా పనిచేస్తారు. వారి ముగ్గురి నుంచే నేను స్పూర్తి పొందాను. మీరు కూడా ఉన్నతమైన వ్యక్తులను రాజకీయాలకు అతీతంగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లండి- లోకేష్

మా కళాశాలలో 8సెక్షన్లు ఉన్నాయి. 4 క్లాస్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. మరో 4 క్లాస్ రూమ్‌లు మంజూరు చేయండి- షేక్ రేష్మా, సీనియర్ ఇంటర్ బైపీసీ

క్లాస్ రూమ్స్, పెయింటింగ్, ప్రహరిగోడ, ల్యాబ్స్ ఏర్పాటుకు కృషి చేస్తా. పాస్ పర్సంటేజీ పెరిగితే మరిన్ని సౌకర్యాలు కల్పిస్తా. కష్టపడి చదివి మంచి పేరు తీసుకురండి- లోకేష్

కళాశాలకు పెయింటింగ్ వేయించండి. ల్యాబ్‌లు ఏర్పాటు చేయండి- కె.నీలిమ, సీనియర్ ఇంటర్, ఎంపీసీ

కళాశాలకు పెయింటింగ్ చేయిస్తా. పెయింట్స్ తోపాటు మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తాం. పరీక్షలు పూర్తయ్యాక అడిషనల్ క్లాస్ రూమ్స్, ఇతర సౌకర్యాలు కల్పిస్తాం- లోకేష్

రాత్రిపూట ఇబ్బంది కలగకుండా కాలేజీ వెలుపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి- రమ్య, సీనియర్ ఇంటర్, బైసీపీ

రేపటికల్లా కెమెరాలు పెట్టిస్తాం, పోలీసు శాఖకు అనుసంధానిస్తాం- లోకేష్

చాగంటి కోటేశ్వరరావు ద్వారా నైతిక విలువల పెంపుదలకు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు?- వైష్ణవి, సీనియర్ ఇంటర్, సీఈసీ

నేను ఇటీవల ఆయనను కలిశాను. పిల్లలకు ప్రత్యేకంగా ఒక బుక్ తయారుచేసి ఇవ్వాలని నిర్ణయించాం. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో క్లస్టర్ యూనిట్ గా నేరుగా పిల్లలతో సమావేశమై చైతన్య పర్చేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. సమాజంలో మార్పురావాలంటే ముందుగా మహిళలు మాట్లాడాలి. మహిళలను అవమానకరంగా మాట్లాడే కొన్ని పద్ధతుల్లో మార్పు రావాలి. మార్పు మా నుంచి, ఫిల్మ్ స్టార్స్ నుంచి, సమాజం నుంచి రావాలి- లోకేష్

Whats_app_banner