Minister Lokesh : ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే, మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు-minister nara lokesh orders officinal no bag day to students on saturdays ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minister Lokesh : ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే, మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

Minister Lokesh : ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే, మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 28, 2025 10:06 PM IST

Minister Lokesh : ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి, కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు.

ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే, మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు
ప్రతి శనివారం విద్యార్థులకు నో బ్యాగ్ డే, మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

Minister Lokesh : ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నుంచి అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలని అధికారులను ఆదేశించారు.

yearly horoscope entry point

ఉపాధ్యాయ బదిలీ చట్టంపై చర్చ

పాఠశాల విద్య డైరెక్టర్ నిర్వహించిన సన్నాహక సమావేశాలలో వచ్చిన అభిప్రాయాలను, సూచనలను అధికారులు మంత్రికి వివరించారు. ఆయా సూచనలను పరిగణనలోకి తీసుకుని ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవ్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఉపాధ్యాయ బదిలీ చట్టంపైనా సమావేశంలో చర్చించారు. ప్రతి శనివారం నో బ్యాగ్ డేగా ప్రకటించి విద్యార్థులకు కో కరిక్యులమ్ యాక్టివిటీస్ రూపొందించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు.

సాంకేతిక పరిజ్ఞానంతో ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. ఉపాధ్యాయులకు ఇప్పుడున్న అనేక యాప్​ల స్థానంలో ఒకటే యాప్​ను రూపొందించి, త్వరతిగతిన అందించాలని ఆదేశించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను నిర్థారించేందుకు అపార్ ఐడీని అనుసంధానం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజాభిప్రాయ సేకరణ కోసం అతి త్వరలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూ ప్రింట్​ను సిద్ధం చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో చేపట్టే సంస్కరణలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ భేటీలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి

"మంగళగిరి నియోజకవర్గం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఆసుపత్రి భవన నిర్మాణంపై అధికారులతో సమీక్ష నిర్వహించాను. ఆసుపత్రిని దేశంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఆదేశించాను. ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించిన ఆసుపత్రి భవన నమూనాను పరిశీలించాను. అధికారులకు పలు సూచనలు చేశాను. మంగళగిరి ప్రజల దశాబ్దాల కల వంద పడకల ఆసుపత్రి. కూటమి ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లోనే ఆసుపత్రిని మంజూరు చేసింది. భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించాను"- మంత్రి లోకేశ్

Whats_app_banner