ఏపీలో 91 పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ- మంత్రి లోకేశ్-minister lokesh says massive investment boost for andhra pradesh 91 big companies set to invest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఏపీలో 91 పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ- మంత్రి లోకేశ్

ఏపీలో 91 పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ- మంత్రి లోకేశ్

ఏపీలో రానున్న ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి లోకేశ్ అన్నారు. రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, వాటికి త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఏపీలో 91 పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ- మంత్రి లోకేశ్

వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. మంగళవారం ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షించారు.

ఇప్పటి వరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో 91 సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని, ఆ కంపెనీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి కంపెనీకి ఒక నోడల్ ఆఫీసర్

రాష్ట్రానికి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.

రూ.91 వేల కోట్ల పెట్టుబడులు

విశాఖ నగరాన్ని అత్యాధునిక సాంకేతికత కేంద్రంగా, ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు 91 ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రూ.91,839 కోట్ల పెట్టుబడులు, 1,41,407 ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చాయన్నారు.

త్వరితగతిన అనుమతులు

ఈ కంపెనీలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా కంపెనీలు ఏర్పాటు చేసేలా ఆయా పరిశ్రమల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలన్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం