Minister Buggana : ఉత్తరాంధ్రకు సచివాలయం వెళ్తే ఇబ్బంది ఏంటి?-minister buggana rajendranath comments on chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Minister Buggana Rajendranath Comments On Chandrababu

Minister Buggana : ఉత్తరాంధ్రకు సచివాలయం వెళ్తే ఇబ్బంది ఏంటి?

HT Telugu Desk HT Telugu
Nov 17, 2022 10:31 PM IST

Buggana Comments On Chandrababu : ఉత్తరాంధ్రకు సచివాలయం వెళ్తే.. ఇబ్బంది ఏంటని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు.. అప్పులు చేస్తున్నాయన్నారు. కేవలం ఏపీ మాత్రమే చేస్తున్నట్టుగా చెబుతున్నారని విమర్శించారు.

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

చంద్రబాబు(Chandrababu) పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. పాఠశాలలు మూసేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయని, ఏపీ ఒక్కటే చేయడం లేదని చెప్పారు. తాను అప్పుల మంత్రి అయితే.. యనమల(Yanamala) తనకన్నా.. పెద్ద అప్పుల మంత్రి అని విమర్శించారు. కోవిడ్‌(Covid) సమయంలోనూ కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని బుగ్గన అన్నారు. చంద్రబాబు(Chandrababu) ఐదేళ్ల పాలనలో 34 వేల ఉద్యోగాలు ఇస్తే తాము లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారని బాబు అనుకుంటున్నారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

'కర్నూలుకు కోర్టు(Court) వద్దని చెబుతున్న చంద్రబాబు రాయలసీమ(Rayalaseema) వ్యక్తి కాదా? ఉత్తరాంధ్రకు సచివాలయం వెళ్తే ఇబ్బంది ఏంటి? ఒక్క ఏపీ మాత్రమే అప్పులు చేస్తోందా? నేను అప్పుల మంత్రి అయితే.. యనమల పెద్ద అప్పుల మంత్రి అనాలి. రాష్ట్రం, దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాం.' అని బుగ్గన రాజేంద్రనాథ్(Buggana Rajendranath) అన్నారు.

ఎనిమిది రాష్ట్రాల్లో హైకోర్టు(High Court)లు రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉన్నాయని బుగ్గన తెలిపారు. రాయలసీమకు చంద్రబాబుకు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుతో పోలీస్తే.. తాము తక్కువే అప్పు చేశామన్నారు. గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటానని చంద్రబాబు(Chandrababu) అంటున్నారని, గతంలో ఓడించారుగా.. ఎందుకు రాజకీయాల్లో ఉన్నారని అడిగారు.

సంక్రాంతిలోపు స్కిల్ హబ్స్

సంక్రాంతి(Sankranthi)లోపు 176 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. స్కిల్ హబ్(Skill Hub)లు, కాలేజీల పురోగతిపై సమీక్ష చేశారు. రాష్ట్రంలో 66 స్కిల్ హబ్స్ ఏర్పాటు చేసి.. 2400 మందికి శిక్షణ అందిస్తున్నామన్నారు. మిగిలినవి సంక్రాంతిలోపు పూర్తి చేస్తామని చెప్పారు. 'ప్రతి స్కిల్​హబ్​లో 2 కోర్సుల చొప్పున మొత్తం 222 కోర్సులలో శిక్షణకు సిద్ధంగా ఉండాలి. 176 స్కిల్​హబ్​లు అందుబాటులోకి తీసుకొచ్చి 10 వేల మందికి పైగా యువతకు శిక్షణ అందించాలని నిర్ణయించాం. నవంబర్ 24, 25, 26 తేదీల్లో సాంకేతిక విద్య ఆధ్వర్యంలో ఏపీ పాలిటెక్​ ఫెస్ట్(AP Polytech Fest) ఉంటుంది.' అని బుగ్గన వెల్లడించారు.

IPL_Entry_Point