Three Capitals : ఫేక్ రైతుల‌తో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ చేస్తున్నారన్నమంత్రి బొత్స-minister botcha says tdp leaders doing yatra in the name of amaravati farmers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Three Capitals : ఫేక్ రైతుల‌తో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ చేస్తున్నారన్నమంత్రి బొత్స

Three Capitals : ఫేక్ రైతుల‌తో అమ‌రావ‌తి పాద‌యాత్ర‌ చేస్తున్నారన్నమంత్రి బొత్స

HT Telugu Desk HT Telugu
Oct 25, 2022 06:11 PM IST

Three Capitals అమరావతి రైతుల మహా పాదయాత్ర పేరుతో టీడీపీ నాయకులు చేసిన పాదయాత్ర భాగోతం బయట పడిందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. రైతుల ముసుగులో టీడీపీ చేసిన పాదయాత్రని తేలిపోయిందన్నారు. మూడు రాజధానుల కోసం రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నామని మంత్రి చెప్పారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

Three Capitals ఏపీలో మూడు రాజ‌ధానుల ఏర్పాటు కోసం రోడ్‌మ్యాప్ త‌యార‌వుతోంద‌ని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్పారు. విశాఖ‌లో ల‌క్ష‌లాదిమందితో జ‌రిగిన గ‌ర్జ‌న స‌భను విజ‌య‌వంతం చేయ‌డం ద్వారా, మూడు రాజ‌ధానుల‌పై ప్ర‌జాభిప్రాయం తేట‌తెల్ల‌మ‌య్యింద‌ని అన్నారు. మూడు రాజ‌ధానుల ఏర్పాటు త‌ధ్య‌మ‌ని, విశాఖ‌ప‌ట్నం ప‌రిపాల‌నా రాజ‌ధాని అవుతుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

Amaravati కోసం ఇప్ప‌టివ‌ర‌కు ఫేక్ రైతుల‌తో అమ‌రావ‌తి పాద‌యాత్ర జ‌రిగింద‌ని మంత్రి ఆరోపించారు. సుమారు 600 మంది రైతుల‌కి కోర్టు అనుమ‌తి ఇచ్చిన‌ప్ప‌టికీ, వారిలో క‌నీసం 60 మందికి కూడా గుర్తింపు కార్డులు లేవ‌న్నారు. రైతుల ముసుగులో టిడిపి నాయ‌కులు చేసిన పాద‌యాత్రగా పేర్కొన్నారు. అందుకే ఫేక్‌ పాద‌యాత్ర ఆగిపోయింద‌న్నారు. విశాఖ రాజ‌ధాని అయితే, ఉత్త‌రాంధ్ర బాగు ప‌డుతుంద‌ని, దీనికి ప్ర‌తీఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని మంత్రి కోరారు.

భోగాపురం అంత‌ర్జాతీయ‌ విమానాశ్ర‌యానికి, కేంద్రీయ గిరిజ‌న విశ్వ‌విద్యాల‌యానికి వ‌చ్చే నెల‌లో ప్ర‌ధాన‌మంత్రి చేత శంకుస్థాప‌న చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామ‌ని మంత్రి బొత్స వెల్లడించారు.

చెరకు రైతులకు సరైన ధర చెల్లిస్తేనే చెరకు తరలింపు : మంత్రి స్పష్టీకరణ

చెరకు రైతులకు నష్టం లేకుండా తగిన ధర చెల్లిస్తేనే సంకిలి చక్కర కర్మాగారానికి భీమసింగి, సీతానగరం చక్కెర ఫ్యాక్టరీల పరిధిలో ఈ సీజన్లో పండించే చెరకు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని మంత్రి స్పష్టం చేశారు. గిట్టుబాటు ధర చెల్లించాల్సిందేనని సంకిలి పారిస్ కర్మాగారం ప్రతినిధులకు మంత్రి స్పష్టం చేసారు.

సంకిలి కర్మాగారానికి ఎప్పటి నుంచి చెరకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంత ధర చేల్లిస్తున్నరనే అంశాలపై మంత్రి చక్కర కర్మాగారం ప్రతినిధులు, షుగర్ కెన్ అధికారులతో సమీక్షించారు. సీతానగరం పరిధిలో నవంబర్ 15న, భీమసింగి పరిధిలో నవంబర్ 16 నుంచి చెరకు తరలింపునకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. చోడవరం చక్కర కర్మాగారం టన్నుకు రూ.2821 చెల్లించి రైతు పొలం వద్ద నుంచే తీసుకు వెళ్లేందుకు సిద్దంగా వున్నారని, ఆ స్థాయిలో ధర చెల్లిస్తేనే సంకిలి ఫ్యాక్టరీ కి ఈ ఏడాది తరలించడం జరుగుతుందని మంత్రి చెప్పారు.

Whats_app_banner