AP Registration Charges : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు- మంత్రి అనగాని
AP Registration Charges Hike : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుదల ఉంటుందన్నారు. మొత్తం మీద 0 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల ఉంటుందన్నారు.
AP Registration Charges Hike : ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖపై తాడేపల్లి ఐజీ కార్యాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రోత్ సెంటర్స్ ఆధారంగా రెవెన్యూ ఛార్జీలు పెరుగుతాయని మంత్రి ప్రకటించారు. అలాగే మొట్టమెదటిసారిగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువగా ఉన్న చోట తగ్గిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సదస్సులకు మంచి రెస్పాన్స్ వస్తుందన్నారు. గడిచిన ఐదేళ్లు రెవెన్యూ సమస్యలు గాలికి వదిలేశారన్నారు. వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తున్నామన్నారు.
గ్రోత్ కారిడార్ల ఆధారంగా ఛార్జీలు
రాష్ట్రంలో మొత్తం మీద 0 నుంచి 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుదల ఉంటుందని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ఛార్జీలు 0 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెల రెవెన్యూ బాగా పెరిగిందని, రూ. 9,500 కోట్ల టార్గెట్ రీచ్ అవుతామన్నారు. రాష్ట్రానికి రెవెన్యూ చాలా అవసరమని, ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ గ్రోత్ కారిడార్లు ఉన్నాయో, ఎక్కడ భూమి రేట్లు బాగా పెరిగాయో అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువల పెంపును శాస్త్రీయ పద్ధతిలో చేయలేదన్నారు.
తగ్గుదల కూడా
రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో భూమి విలువ కంటే రిజిస్ట్రేషన్ విలువ అధికంగా ఉన్నట్లు గుర్తించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వాటిని సరిచేస్తున్నామన్నారు. అలాంటి చోట్ల రిజిస్ట్రేషన్ విలువను తగ్గిస్తామన్నారు. భూముల రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే చోట సగటున 0 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందన్నారు.
జనవరి 15 నాటికి నివేదిక
జనవరి 15 నాటికి రిజిస్ట్రేషన్ ఛార్జీల నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశించారు. చరిత్రలో మొదటిసారిగా కొన్ని ప్రాంతాల్లో భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గించనున్నామని చెప్పారు. మరికొన్ని ప్రాంతాల్లో పెంపడం, తగ్గించడం ఉండదని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టమన్నారు. నరసరావుపేటలో రూ. 12 లక్షలు ఉన్న భూమి, ఇవాళ రూ.1.8 కోట్లకు చేరిందన్నారు. జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం ద్వారా భూములను గుర్తిస్తామన్నారు.
సంబంధిత కథనం