Ambati Rambabu : ఇప్పటం అంశంలో టీడీపీ, పవన్ అభాసుపాలు….అంబటి
Ambati Rambabu ఇప్పడం గ్రామస్తులకు హైకోర్టు జరిమానా విధించినా టీడీపీ, జనసేన పార్టీలకు జ్ఞానం కలగలేదన్నారు మంత్రి అంబటి రాంబాబు. నోటీసులు జారీ చేసి ఆఖ్రమణలు తొలగించినా మీడియా అండతో రాద్దాంతం చేశారన్నారు. హైకోర్టునే మోసం చేయగలిగిన వారి తీరును ప్రజలంతా గమనించాలన్నారు.
Ambati Rambabu ఇప్పటం గ్రామంలో జరిగిన చిన్న ఘటనను టీడీపీ, పవన్ కళ్యాణ్ గగ్గోలు పెట్టి నానా బీభత్సం చేశారని మంత్రి అంబటి ఆరోపించారు. నాలుగు ఆక్రమణల గోడలు కూలిస్తే అసలు ప్రభుత్వాన్నే కూల్చివేయాలనే స్థాయిలో అనుభవం లేని పవన్ కళ్యాణ్ రెచ్చిపోయి మాట్లాడాడని, చివరికి హైకోర్టు తీర్పుతో.. వారి అసలు బండారమంతా బయటపడిందన్నారు. చట్టప్రకారమే అక్కడ అంతా జరిగినా, అఫిడవిట్‌లో తప్పులు రాసి స్టే తెచ్చుకున్నారని హైకోర్టు చేప్పిందని, రాజకీయాల్లో ఒకరిని మోసం చేస్తే పర్లేదని, చివరికి కోర్టులనే వీరు మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటంలో ఆక్రమణదారులకు సంబంధించి పిటీషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా వేసిన అంశాన్ని చూస్తే ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చేయడానికి చేసిన కుట్రలు బయటపడ్డాయన్నారు. ఇలాంటి కుట్రలు చేస్తే, ఏం జరుగుతుందో ఇప్పటికైనా దుష్టచతుష్టయం తెలుసుకోవాలన్నారు. కాస్తయినా, బుద్ధీ, జ్ఞానం తెచ్చుకుని ప్రవర్తించాలని మంత్రి అంబటి హితవు పలికారు.
బ్యాంకుల్లో వేయాల్సిన డబ్బు ఏం చేస్తున్నారు….?
గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చిట్ ఫండ్ కంపెనీలలో సోదాలు జరుగుతున్నాయని, ఆ సోదాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వారందరిపై చట్టప్రకారం కేసులు పెట్టి శిక్షించే కార్యక్రమం జరుగుతోందని మంత్రి రాంబాబు చెప్పారు. ఇందులో ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ కూడా చట్టాన్ని ఉల్లంఘించిన అంశాలు తేటతెల్లంగా కన్పిస్తున్నాయన్నారు. చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎంతటివారైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని చెప్పారు.
దున్నపోతు ఈనింది.. అంటే దూడను కట్టేయమన్న చందంగా విజయసాయిరెడ్డి సెల్ ఫోన్ గురించి పనికిమాలిన చర్చను టీడీపీ, ఎల్లో మీడియా చేస్తుందని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. వారి మాటలు, చేష్టలు టీడీపీ దీనస్థితిని తెలియజేస్తున్నాయన్నారు. చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
టాపిక్