Ambati On Pawan : పవన్ పాతిక కంటే ఎక్కవ సీట్లలో పోటీ చేస్తారా?
Ministers On Capital Amaravati : అమరావతిపై సుప్రీం కోర్టులో విచారణపై మంత్రులు స్పందించారు. రాజధానుల విషయంలో హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీం వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై మంత్రులు విమర్శలు గుప్పించారు.
రాజధానిని నిర్ణయించాల్సింది.. రాష్ట్ర ప్రభుత్వమేనని సుప్రీం కోర్టు(Supreme Court) వ్యాఖ్యలతో స్పష్టమైందని మంత్రి అంబటి రాంబాబు(Minister Ambati Rambabu) అన్నారు. రాజధానుల విషయంలో హైకోర్టు(High Court) జోక్యం సరికాదని సుప్రీం కోర్టు మాటలను బట్టి తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని చెప్పారు. హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని, రాజధానుల విషయంలో హైకోర్టు జోక్యం సరికాదని సుప్రీం వ్యాఖ్యలతో తెలుస్తుందని అంబటి అభిప్రాయపడ్డారు.
'రాజధానిని నిర్ణయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే అని స్పష్టమవుతోంది. న్యాయ స్థానాల పని న్యాయస్థానాలు చేయాలి. ప్రభుత్వం(Govt) పనులను ప్రభుత్వం చేయాలి. చంద్రబాబు(Chandrababu) అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను ఇకపై మానుకుంటే మంచిది. అమరావతి రాజధాని(Capital Amaravati) అనేది పెద్ద స్కామ్. నిజమైన అమరావతి రైతులు(Amaravati Farmers) ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాల్లో హీరో.., రాజకీయాల్లో జీరోగా ఉన్నారు. పాతిక కన్నా.. ఎక్కువ సీట్లలో పోటీ చేస్తారా? ఎవరితో కలిసి పోటీ చేస్తారు?' అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు చంద్రబాబు అని.. మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudiwada Amarnath) వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలతో చంద్రబాబుకు బుద్ధి రావాలన్నారు. సుప్రీం వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉండాలనే మూడు రాజధానులు అని పేర్కొన్నారు. రాజధాని(Capital) అంటే జేబులు నింపుకోవడం మాత్రమే కాదని మరోసారి అన్నారు. ఐడీ కార్డులు అడిగితే.. అమరావతి పాదయాత్ర(Amaravati Padayatra) నుంచి రైతులు పారిపోయారని ఎద్దేవా చేశారు.
స్వలాభం కోసం అమరావతిని టీడీపీ(TDP) తెరపైకి తెచ్చిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు(Kurasala Kannababu) అన్నారు. శివరామకృష్ణ కమిటీ నివేదికను పట్టించుకోలేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శాసనసభ ఆమోదంతో సీఎం జగన్(CM Jagan) నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. సీఎం జగన్(CM Jagan) మెుదటి నుంచి చెప్పిన విషయాన్నే.. సుప్రీం కోర్టు అంతర్లీనంగా వ్యాఖ్యానించిందన్నారు. శాసన వ్యవస్థలోకి న్యాయవ్యవస్థ చొరబడిందని తాము అప్పుడే చెప్పామని కురసాల కన్నబాబు అన్నారు.
'న్యాయవ్యవస్థపై మాకు గౌరవం ఉంది. సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యలు న్యాయానికి ధర్మానికి ఉన్న విలువగా భావిస్తున్నాం. సుమారు 4700 ఎకరాలను చంద్రబాబు తమ సొంత మనుషులుతో కొనిపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్(Insider Trading)కు పాల్పడ్డారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో టీడీపీ, జనసేన(Janasena) కళ్లు తెరుచుకోవాలి.' అని కురసాల కన్నబాబు అన్నారు.