Ambati On Pawankalyan: చంద్రబాబు కోసమే జనసేన పుట్టిందన్న అంబటి రాంబాబు-minister ambati rambabu accused that janasena was born only for chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Minister Ambati Rambabu Accused That Janasena Was Born Only For Chandrababu

Ambati On Pawankalyan: చంద్రబాబు కోసమే జనసేన పుట్టిందన్న అంబటి రాంబాబు

Sarath chandra.B HT Telugu
Oct 24, 2023 09:32 AM IST

Ambati On Pawankalyan: సున్నా సున్నా కలిస్తే సున్నానే అవుతుందని, సున్నా సున్నా హెచ్చిస్తే కూడా సున్నానే అవుతుందని జగన్‌ చెప్పారని లోకేష్‌, పవన్‌ భేటీలో అదే కనిపించిందని మంత్రి అంబటి రాంబాబు ఎద్దే వా చేశారు. పాతకలయికకు రాజమండ్రిలో కొత్త రూపాన్ని ఇచ్చారన్నారు.

మంత్రి అంబటి రాంబాబు
మంత్రి అంబటి రాంబాబు

Ambati On Pawankalyan: టీడీపీ, జనసేనల పాత కలయికకు రాజమండ్రిలో కొత్త రూపునిచ్చారని పవన్‌ కల్యాణ్‌ టీడీపీతో విడిపోయింది ఎప్పుడని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పుట్టిందన్నారు. సున్నా సున్నా కలిసినా, హెచ్చించినా సున్నానే అవుతుందని ఎద్దేవా చేశారు.

ట్రెండింగ్ వార్తలు

పవన్‌ కల్యాణ్‌‌కు వ్యవస్థలపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. బాబుకు బెయిల్ఇవ్వాలా వద్దా అనేది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని, దానికి జగన్‌పై ఏడవడం దేనికన్నారు. కాపు రిజర్వేషన్ల పోరాటంలో అరెస్టులు జరిగితే అవి అక్రమం కాదా అని నిలదీశారు. చంద్రబాబు అరెస్ట్‌ మాత్రమే అక్రమమా అని ప్రశ్నించారు.

జైలు లోపల చంద్రబాబు ఊచలు లెక్కేసుకోవడం..బయట ఉన్న పుత్రుడు, దత్తపుత్రుడు రోజులు లెక్కేసుకోవడమే మిగిలి ఉందన్నారు. చంద్రబాబు అభిమానుల రూపంలో తెలుగు గడ్డపై ఇంకా నరకాసురులు ఉన్నారని, టీడీపీ వారు దిష్టిబొమ్మలు తగలేసే కార్యక్రమమాన్ని చేయాలని పిలుపునివ్వడం చూశాక తెలుగు గడ్డపై నరకాసురుడు, రావణాసురుడి వారసులు, అభిమానులు నారా చంద్రబాబునాయుడి మద్దతు దారుల్లా ఇంకా మిగిలి ఉన్నారని అనిపిస్తోందన్నారు.

రాజమండ్రిలో పుత్రుడు, దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారని, ఆ సమావేశం కూడా అట్టర్‌ ప్లాప్‌ షో అయ్యిందన్నారు. సున్నా సున్నా కలిస్తే సున్నా అవుతుందని, సున్నా సున్నా హెచ్చిస్తే సున్నానే అవుతుందని మొన్ననే జగన్ చెప్పారని, అదే ఇక్కడ కనిపించిందన్నారు.

వైఎస్సార్సీపీకి వ్యతిరేకం కాదు...వారి విధానాలకే వ్యతిరేకం అని పవన్‌ కల్యాణ్‌ అంటున్నాడని, మేం మాత్రం నీకు వ్యతిరేకమా పవన్‌ కల్యాణ్‌..? నీకూ మాకూ ఏమన్నా తగాదా ఉందా అని ప్రశ్నించారు. పవన్‌ విధానం ఏంటి..? టీడీపీతో నువ్వు ఈ రోజు కలిశావా అని నిలదీశారు. 2014లో తెలుగుదేశంతోనే కదా ముందుకు వెళ్లావన్నారు.

2019లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేసి..ఇప్పుడు మళ్లీ కలిసి పోటీ చేస్తున్నావన్నారు. అందుకే కదా నిన్ను ప్యాకేజీ స్టార్‌ అన్నదన్నారు. ప్యాకేజీ స్టార్‌ వి కాబట్టే పవన్‌ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.

పవన్ విధానమే తప్పని టీడీపీ కోసమే పుట్టిన రాజకీయ పార్టీ అన్నారు. టీడీపీకి ఏదైనా నష్టం జరుగుతుందనుకుంటే వెంటనే కాచుకోడానికి వస్తాడని, మొన్న విడిగా పోటీ చేశానని ప్రగల్భాలు పలికి దాని వల్ల లబ్ది ఎవరికి కలిగిందన్నారు. ఇవాళ ఓట్లు చీలనివ్వవు..అప్పుడేమో ఓట్లు చీలనిస్తావు అంటే పవన్ విధానం ఏమిటో అర్థం అవుతోందన్నారు.

చంద్రబాబుకు మనోధైర్యం ఇవ్వడం కోసం రాజమండ్రిలో సమావేశం పెట్టామని చెబుతున్నాడని , చంద్రబాబు మనోధైర్యం కోల్పోయాడు, ఆయనకు మనోధైర్యం ఇవ్వడం కోసమే తప్ప ప్రజల కోసం ఏమీ చర్చించలేదనేది స్పష్టమైందన్నారు. .

పవన్‌ కల్యాణ్‌ను టీడీపీ నేతలు రిసీవ్‌ చేసుకుంటుంటే లోకేశ్‌ ముఖం మాడిపోయిందని, వేదికంతా చూస్తే సీనియర్‌ నాయకులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించిన తీరు చూస్తే లోకేశ్‌ కిమ్మనలేకపోయాడన్నారు. టీడీపీ బలహీనపడిందని ఎప్పుడో చెప్పిన నువ్వు దాన్ని బలోపేతం చేయడం కోసం ఈ రోజు కలిశాను అని స్పష్టంగా చెప్పావన్నారు.

WhatsApp channel