CBN On Mega DSC: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌, సీఎం చంద్రబాబు తీపికబురు.. ఆర్థిక శాఖ సమీక్షలో ప్రకటన-mega dsc notification soon cm chandrababu naidu announcement in finance department review ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn On Mega Dsc: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌, సీఎం చంద్రబాబు తీపికబురు.. ఆర్థిక శాఖ సమీక్షలో ప్రకటన

CBN On Mega DSC: త్వరలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌, సీఎం చంద్రబాబు తీపికబురు.. ఆర్థిక శాఖ సమీక్షలో ప్రకటన

Sarath Chandra.B HT Telugu
Published Feb 12, 2025 03:00 AM IST

CBN On Mega DSC: ఏపీలో మెగా డిఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలో ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కార్యదర్శుల సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. గత జూన్‌లో మెగా డిఎస్సీ ప్రకటించినా ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో వాయిదా పడింది.

త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు
త్వరలో మెగా డిఎస్సీ నిర్వహిస్తామన్న సీఎం చంద్రబాబు

CBN On Mega DSC: ఆంధ్రప్రదేశ్‌లో త్వ‌ర‌లోనే డీఎస్సీ నిర్వ‌హిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్వ‌ర‌లోనే డీఎస్సీ నిర్వ‌హించి ఉద్యోగ నియామ‌కాలు చేప‌డ‌తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాలకు రావాల్సిన నిధులు ఎంత‌మేర రాబ‌ట్ట‌గ‌లుగుతామో ఆ మేరకు రాబ‌ట్టేలా ప‌ని చేయాల‌ని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ పూర్తిస్థాయిలో గాడిలో ప‌డాలంటే మ‌రికొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు.

గ‌త ప్ర‌భుత్వం వ‌ల్ల ఏర్ప‌డ్డ న‌ష్టాలు వెంటాడుతున్నా, ఆర్థిక ఇబ్బందులు, బాధ‌లున్న‌ప్ప‌టికీ కూడా కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఈ ఎనిమిది నెల‌ల్లోనే రూ.22,507 కోట్ల పాత బ‌కాయిల‌ను చెల్లించ‌ గ‌లిగింద‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. ఇది ఈ ప్ర‌భుత్వ నిబద్ద‌కు నిద‌ర్శ‌న‌మ‌న్నారు.

రాష్ట్రంలో చాలా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డింద‌ని, ఎన్నో స‌వాళ్లు ఇబ్బందులు ఎదుర‌య్యాయ‌ని, అయిన‌ప్ప‌టికీ క్ర‌మ‌శిక్ష‌ణ‌తో పాత బ‌కాయిల‌ను కూడా తీర్చ‌గ‌లిగేలా ఆర్థిక శాఖ ప‌నిచేయ‌డం సంతోష‌దాయ‌క‌మ‌ని ఆ శాఖ అధికారుల‌ను ప్ర‌శంసించారు.

మంత్రులు, కార్య‌ద‌ర్శుల స‌ద‌స్సులో ఆ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ ఇచ్చిన ప్ర‌జంటేష‌న్‌పైన సీఎం స్పందించారు. గ‌త పాల‌కుల నిర్వాకం వ‌ల్ల ఇంకా చెల్లించాల్సి పాత బ‌కాయిలు చాలా ఉన్నాయ‌ని చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం చేసిన ప‌నికి ఆ ఇబ్బందులు ఇప్ప‌టికీ మ‌న‌ల్ని వెంటాడుత‌న్నాయి, అయిన‌ప్ప‌టికీ మ‌నం ఇంకా మ‌న ప‌నితీరు పెంచుకుని వాటిని అధిగ‌మించాల‌న్నారు.

ఇన్ని ఇబ్బందుల్లోనూ మ‌నం ప్ర‌తి నెలా ఒక‌టో తేదీనే ఉద్యోగుల‌కు జీతాలు, పింఛ‌న్లు చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. భవిష్య‌త్తులోనూ ఎన్ని క‌ష్టాలున్నా స‌రే, ఉద్యోగులకు ఒక‌టో తేదీన జీతాలు, పింఛ‌న్లు చెల్లించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

కేంద్ర స‌హ‌కారంత అమ‌రావ‌తి, పోల‌వ‌రం లాంటి ప‌నులు కూడా చేపడుతున్నామ‌ని, క్యాపిట‌ల్ ఎక్స్‌పిండిచ‌ర్ కింద‌, నీటిపారుద‌ల‌, ర‌హ‌దారులు త‌దిత‌ర ప‌నుల‌కు సంబంధించిన బిల్లులు క్లియ‌ర్ చేశామ‌న్నారు.

వేత‌నాల‌కు రూ.85 వేల‌ కోట్లు

ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ఒక‌టో తేదీనే ఉద్యోగుల‌కు వేత‌నాలు, పింఛ‌న్లు చెల్లిస్తున్నామ‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద్దు కింద రూ.85,445 కోట్లు చెల్లించామ‌ని ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ‌, ఎన్టీఆర్ భ‌రోసా, దీపం 2.0 ప‌థ‌కాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ.31,613 కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. స్థానిక సంస్థ‌ల బ‌లోపేతం కొర‌కు పంచాయ‌తీల‌కు రూ.2,488 కోట్లు విడుద‌ల చేసిన‌ట్లు వెల్ల‌డించారు. మొత్తం 95 సెంట్ర‌ల్ స్పాన్స‌ర్డ్ ప‌థ‌కాల్లో 74 ప‌థ‌కాల‌ను పునరుద్దరించినట్టు వెల్ల‌డించారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్థాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. ఈనాడు, ఎన్టీవి, టీవీ9, హెచ్‌ఎంటీవి, ఎక్స్‌ప్రెస్‌ టీవీ, టీవీ5లలో పని చేశారు. 2010-14 మధ్యకాలంలో హెచ్‌ఎంటీవీ, మహా టీవీలో ఢిల్లీ బ్యూరో చీఫ్‌/అసిస్టెంట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. నాగార్జున వర్శిటీ క్యాంపస్ కాలేజీలో జర్నలిజంలో పట్టభద్రులయ్యారు. 2022లో హెచ్‌టీలో చేరారు.
Whats_app_banner