AP Govt : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - జాబితా ఇదే-massive transfer of ias officers in andhra pradesh full list check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - జాబితా ఇదే

AP Govt : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు - జాబితా ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 11, 2024 05:38 PM IST

Transfer Of IAS Officers in AP : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు.

ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు

ఏపీలో కొత్త ప్రభుత్వం రావటంతో అధికారుల బదిలీలు భారీగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొత్తం 19 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి నియమితులయ్యారు.రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాంతీలాల్‌ ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఐఏఎస్ అధికారుల బదిలీలు - తాజా జాబితా

  • అటవీశాఖ స్పెషల్‌ సీఎస్‌గా అనంతరాము నియామకం.
  • రవాణాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా కాంతీలాల్‌.
  • సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా జయలక్ష్మి నియామకం.
  • ల్యాండ్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌శాఖ సీఎస్‌గా రామ్‌ ప్రకాష్‌ సిసోడియా.
  • పెట్టుబడులు మౌలిక వసతులు కార్యదర్శిగా సురేష్ కుమార్
  • ఏపీ పరిశ్రమలు శాఖ డైరెక్టర్‌గా సి. శ్రీధర్
  • ఏపీ ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా జే నివాస్
  • పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా వి.విజయరామరాజు నియామకం.
  • క్రీడలు యువజన సర్వీసుల శాఖ కార్యదర్శిగా వివేక్ యాదవ్ నియామకం.
  • మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఏ సూర్యకుమారి
  • సమాచారశాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా
  • ఐటీ శాఖ కార్యదర్శిగా శౌరబ్ గౌర్‌కి అదనపు బాధ్యతలు
  • పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శిగా ఎన్.యువరాజ్
  • మైనారిటీ వెల్ఫేర్ కార్యదర్శిగా హర్షవర్థన్
  • సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబు బదిలీ
  • గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా కన్నబాబుకి అదనపు బాధ్యతలు.
  • వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా ఢిల్లీ రావు నియామకం.

ఐపీఎస్ అధికారుల బదిలీ….

ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇద్దరు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులను జారీ చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ గా హరీశ్ కుమార్ గుప్తాను బదిలీ చేశారు. కుమార్ విశ్వజిత్ ను రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిగా నియమించారు.

WhatsApp channel