Trains Cancellation: ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు-massive train cancellations in telugu states due to interlocking work ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancellation: ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు

Trains Cancellation: ఇంటర్‌ లాకింగ్ పనుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్ల రద్దు

Bolleddu Sarath Chandra HT Telugu
Published Feb 07, 2025 10:40 AM IST

Trains Cancellation: తెలుగు రాష్ట్రాల్లో భారీగా రైళ్లు రద్దు చేశారు. విజయవాడ రైల్వే డివిజన్‌లోని నూజివీడు-వట్లూరు- ఏలూరు నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో ఏపీలో, ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో తెలంగాణలో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఏపీ తెలంగాణల్లో భారీగా  రైళ్ల రద్దు
ఏపీ తెలంగాణల్లో భారీగా రైళ్ల రద్దు

Trains Cancellation: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు సెక్షన్లలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులతో భారీగా రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

విజయవాడ రైల్వే డివిజన్‌లో నూజివీడు-వట్లూరు-ఏలూరు మధ్య ఆటోమేటిక్ సెక్షన్‌ను ప్రారంభించేందుకు నాన్-ఇంటర్ లాకింగ్ పనుల్ని చేపడుతున్నారు. దీంతో ఫిబ్రవరి 8న ఆరు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో 13 రైళ్లను దారి మళ్లి స్తున్నారు.

ఈ రైళ్లు రద్దు…

రాజమహేంద్రవరం-విజయవాడ (67261), విజయవాడ- రాజమహేంద్రవరం (67262), విజ యవాడ-రాజమహేంద్రవరం (67202), రాజమ హేంద్రవరం-విజయవాడ (67201). కాకినాడ పోర్టు-విజయవాడ(17258), విజయవాడ-కాకి నాడ పోర్టు(17257) రైళ్లు శనివారం (ఫిబ్రవరి 8వ తేదీన) రద్దు చేశారు.

శుక్రవారం దారి మళ్లించే రైళ్లు…

  • షాలిమార్-చెన్నై సెంట్రల్ (12841), షాలిమార్-హైదరాబాద్ (18045), ధన్బాద్-అలప్పుజ (13351), సంత్రాగచి-చెన్నై సెంట్రల్ (22801), టాటా-బెంగళూరు (12883) ఎక్స్ ప్రెస్ రైళ్లను నిడదవోలు-గుడివాడ-విజయవాడ మీదుగా మళ్లిస్తారు.
  • సీఎస్టి ముంబై- భువనేశ్వర్ (11019), బెంగళూరు-గౌహతి (12309) రైళ్లను విజయవాడ-గుడివాడ-నిడదవోలు మీదుగా దారి మళ్లిస్తారు.
  • శనివారం ఫిబ్రవరి 8వ తేదీన కాకినాడ పోర్టు-ఎన్టీటీ ముంబయి (17221), విశాఖపట్నం-గుంటూరు (17240) రైళ్లను నిడదవోలు-గుడి వాడ-విజయవాడ మీదుగా, గుంటూరు-విశాఖ పట్నం (17239). సికింద్రాబాద్- సంత్రాగచి (07221), (12806), చెన్నై సెంట్రల్-షాలిమార్ (12842) రైళ్లను విజ యవాడ-గుడివాడ-నిడదవోలు మీదుగా మళ్లిస్తారు.

తెలంగాణలో రైళ్లు రద్దు…

ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద జరుగుతున్న నాన్ఇం టర్ లాకింగ్ పనుల నేపథ్యంలో 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజ యవాడ, భద్రాచలంరోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 10 వ తేదీ నుంచి 20 వరకు రద్దు చేశారు.

గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవు. మరో 9 రైళ్లను దారి మళ్లిస్తారు. నాలుగు రైళ్లు 60 నుంచి 90 నిమిషాల ఆలస్యంగా బయల్దేరనున్నాయి.

రద్దయిన రైళ్లు ఇవే...

  • సికింద్రాబాద్-గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు రద్దు చేశారు.
  • సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్‌ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లను 10 నుంచి 21 వరకు రద్దు చేశారు.
  • గుంటూరు-సికింద్రాబాద్ (12705/12706) ఇంటర్సెటీ ఎక్స్‌ప్రెస్‌ 10, 11, 15, 18, 19, 20 తేదీలలో రద్దు చేశారు.
  • విజయవాడ- సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ ఫిబ్రవరి 11, 14, 16, 18, 19, 20 తేదీల్లో రద్దు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్ ప్రెస్ 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది. ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ప్రెప్రెస్ 9, 11, 14, 18, 19 తేదీల్లో గంటన్నర ఆలస్యంగా నడుస్తాయి.

Whats_app_banner